https://oktelugu.com/

కాంగ్రెస్ కు పులులు.. సింహాలు అక్కర్లేదంటున్న జగ్గారెడ్డి..!

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం అనివార్యమైంది. కొత్త ఏడాదిలోనే కొత్త పీసీసీని నియమించేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తుంది. Also Read: రణరంగమైన రామతీర్థం తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ పదవీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలంతా పోటీపడుతున్నారు. పీసీసీ చీఫ్ పదవీకి పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలోనే రేవంత్ రెడ్డికే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 2, 2021 / 04:27 PM IST
    Follow us on

    టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం అనివార్యమైంది. కొత్త ఏడాదిలోనే కొత్త పీసీసీని నియమించేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తుంది.

    Also Read: రణరంగమైన రామతీర్థం

    తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ పదవీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలంతా పోటీపడుతున్నారు.

    పీసీసీ చీఫ్ పదవీకి పోటీ ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలోనే రేవంత్ రెడ్డికే పీసీసీ పదవీ దక్కుతుందనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో కాంగ్రెస్ సీనియర్లు అలర్ట్ అయ్యారు.

    రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. తొలి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నేపథ్యంలో సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలకు మరోసారి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

    Also Read: ఏపీలో మరో ఆరు నెలలు ‘స్పెషల్‌’ పాలన

    పీసీసీ చీఫ్ పదవీ కోసం పులులు.. సింహాలు అవసరం లేదని.. అందరినీ కలుపుకొని పోతూ పార్టీకి విధేయుడిగా ఉన్న నాయకుడే కావాలని లేఖలో సూచించారు. అలాగే పార్టీ బలోపేతానికి 25మందితో కమిటీ వేస్తే బాగుంటుందని కోరినట్లు తెలుస్తోంది.

    25మందికి ఐదు నియోజకవర్గాల బాధ్యతలను గెలిపించే బాధ్యతను అప్పగిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని పేర్కొన్నాడు. వీరితోపాటు రైతులు.. నిరుద్యోగులు.. మహిళలు.. మైనారిటీ.. ఎస్సీ.. ఎస్టీల సమస్యల పరిష్కారానికి విడిగా కమిటీలు వేయాలని కోరాడు.

    త్వరలోనే నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఉన్నందున అప్పటిదాకా పీసీసీ నియామకం వాయిదా వేయాలని కోరాడు. దీనిలో తన స్వార్థమేమి లేదని సాగర్లో కాంగ్రెస్ గెలవాలన్నది తన కోరిక అని పేర్కొన్నాడు. పరిధిదాటి మాట్లాడితే తనను క్షమించాలని కోరినట్లు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్