spot_img
Homeఆంధ్రప్రదేశ్‌రణరంగమైన రామతీర్థం

రణరంగమైన రామతీర్థం

Ramatheertham
విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఆలయంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఆలయాన్ని పరిశీలనకు వెళ్తున్నట్లు ప్రకించిన వెంటనే.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు కంటే ముందే రామతీర్థం చేరుకున్న ఆయన.. కొండెక్కి ఆలయాన్ని దర్శించారు. ఘటనపై స్థానిక అధికారులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read: ఏపీలో మరో ఆరు నెలలు ‘స్పెషల్‌’ పాలన

అయితే .. విజయసాయి రెడ్డి రాకను టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయం చేయడానికే విజయసాయి రెడ్డి వచ్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వేలాది మంది కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. విజయసాయి రెడ్డి కొండదిగి వచ్చిన తర్వాత ఆయన వాహనంలోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు విజయసాయి రెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. మరోవైపు విజయసాయి రెడ్డిని కొండపైకి అనుమతించి తమను ఎందుకు అనుమతించలేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబును విజయనగరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. విజయసాయి రెడ్డి రామతీర్థం ఆలయంలోకి వెళ్లిన సమయంలో చంద్రబాబును అనుమతిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశముండటంతో అక్కడే నిలిపేశారు. విజయసాయి రెడ్డి వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్‌కి పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు.

Also Read: పల్లెల నుంచే ఐటీ సేవలు

మరోవైపు శ్రీరాముడిపై దాడి చేసిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు దోషులను శిక్షించేవరకు రామతీర్థం నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమను ఆలయంలోకి వెళ్లనీయకుండా రాజకీయ నాయకులను అనుమతించడంపై స్వామిజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆలయంలో విగ్రహ ధ్వంసంపై పోలీసులు ఐదుగురిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. విగ్రహ ధ్వంసం ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విచారణ పేరుతో తీసుకెళ్లిన పోలీసులు తమ వారు ఎక్కడున్నారో చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరిబాబు ఎలాంటి తప్పు చేయలేదని వెంటనే విడుదల చేయాలని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version