కొత్తగా పెళ్లైందా.. ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..?

సాధారణంగా పెళ్లి సమయంలో చాలామంది అమ్మాయిలు తమ పేర్లను మార్చుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే పేరు మారినా ఆధార్ కార్డులో పాత పేరే ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటైన ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ ను సులభంగా మార్చుకోవచ్చు. కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటైన ఆధార్ కార్డ్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పొందవచ్చు. Also Read: ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. గుర్తు పెట్టుకోవాల్సిన […]

Written By: Navya, Updated On : February 6, 2021 5:53 pm
Follow us on

సాధారణంగా పెళ్లి సమయంలో చాలామంది అమ్మాయిలు తమ పేర్లను మార్చుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే పేరు మారినా ఆధార్ కార్డులో పాత పేరే ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటైన ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ ను సులభంగా మార్చుకోవచ్చు. కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటైన ఆధార్ కార్డ్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పొందవచ్చు.

Also Read: ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. గుర్తు పెట్టుకోవాల్సిన తేదీలివే..?

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలన్నా ఆధార్ కార్డ్ కచ్చితంగా అవసరం అనే సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ లాంటి వివరాలను మార్చుకోవాలని భావిస్తే కచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ను కలిగి ఉంటే మాత్రమే వివరాలను మార్చుకోవడం సాధ్యమవుతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేసి సులువుగా పేరును మార్చుకోవచ్చు.

Also Read: ఈ పంట పండిస్తే కోటీశ్వరులు కావచ్చు.. కిలోకి లక్ష ఆదాయం..?

పేరు కాకుండా అడ్రస్ ను మాత్రమే మార్చుకోవాలని భావిస్తే మాత్రం కరెంట్ బిల్లు సహాయంతో కూడా అడ్రస్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్ కార్డుకు రిజిష్టర్ అయిన మొబైల్ నంబర్ ఉంటే మాత్రమే వివరాలను మార్చుకోవడం సాధ్యమవుతుంది. ఒకవేళ ఇప్పటికే రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ లేకపోతే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

మొబైల్ నంబర్ ఉంటే ఆన్‌లైన్‌లోనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా పేరు, అడ్రస్, పుట్టినతేదీ, జెండర్ వివరాలను మార్చుకునే అవకాశం ఉంటుంది. యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఈ వివరాలను మార్చుకోవచ్చు.