ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. గుర్తు పెట్టుకోవాల్సిన తేదీలివే..?

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఖాతాదారులకు ఖాతాలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడంతో పాటు పాత చెక్కులు వినియోగించడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఖాతాలకు సంబంధించిన మార్పుల గురించి అవగాహన లేకపోతే ఖాతాదారులు ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే బ్యాంకులకు సంబంధించి బ్రాంచులు, ఏటీఎంల విలీనం పూర్తైన సంగతి తెలిసిందే. Also Read: కొత్తగా పెళ్లైందా.. ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..? యూనియన్ బ్యాంక్ […]

Written By: Navya, Updated On : February 6, 2021 5:45 pm
Follow us on

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఖాతాదారులకు ఖాతాలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడంతో పాటు పాత చెక్కులు వినియోగించడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఖాతాలకు సంబంధించిన మార్పుల గురించి అవగాహన లేకపోతే ఖాతాదారులు ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే బ్యాంకులకు సంబంధించి బ్రాంచులు, ఏటీఎంల విలీనం పూర్తైన సంగతి తెలిసిందే.

Also Read: కొత్తగా పెళ్లైందా.. ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..?

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే అకౌంట్ నంబర్ లో ఎటువంటి మార్పులు జరగవు. కానీ యూనియన్ బ్యాంక్ వెబ్ సైట్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు సంబంధించిన లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తోనే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

Also Read: బెగ్గర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. రోజుకు రూ.215..!

అయితే ఆన్ లైన్ లావాదేవీలకు అవసరమైన ఐ.ఎఫ్.ఎస్.సీ. కోడ్ వివరాలు మాత్రం మారనున్నాయి. మార్చి నెల 1వ తేదీ నుంచి కొత్త ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ ఉంటే మాత్రమే లావాదేవీలను జరపడం సాధ్యమవుతుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ విలీనం కానున్నాయి. ఈ బ్యాంకులలో అకౌంట్ ఉంటే మార్చి 31వ తేదీ వరకే ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ లు, చెక్ బుక్ లు పని చేస్తాయి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఏప్రిల్ నెల 1వ తేదీలోగా పాత చెక్ బుక్ ను మార్చుకోవడంతో పాటు బ్యాంకును సంప్రదించి కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ ను తెలుసుకోవాలి. విజయా బ్యాంక్, దేవా బ్యాంక్ లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కాగా ఈ రెండు బ్యాంకులలో అకౌంట్ ఉంటే బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను తెలుసుకోవఛ్చు