Rare creatures on earth : ఈ భూమిపై ఎన్నో జీవ జాతులు ఉన్నాయి. వాటిలో చాలా జంతువులు మనకు తెలుసు. మనకు తెలియని వాటిని కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ భూమిపై మూడొంతులు ఉన్న సముద్రంలో ఇంకా ఎన్నో అరుదైన , మనం చూడని జంతుజాలం ఉంది. ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెట్టినా కూడా ఇంకా చాలా సముద్రపు అడుగున ఉన్నాయి. ఆ జంతువులు అప్పుడప్పుడు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వస్తుంటాయి. అలాంటివి చూసి శాస్త్రవేత్తలే నోరెళ్ల బెడుతారు.
-పసిఫిక్ సముద్రంలో వింత జీవి

తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో తొలిసారిగా అరుదైన జంతువు కనిపించింది. సినీడారియన్, జాన్స్టన్ అటోల్‌కు ఉత్తరాన పసిఫిక్ మహాసముద్రంలో 2,994 మీటర్ల లోతులో ఎన్నడూ చూడని ఒక వింత జీవిని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సొలుమెల్లాలా అని దీన్ని పిలుస్తున్నారు. ఇది 2-మీటర్ల పొడవైన కొమ్మ ఆకారంలో ఉంది. 40 సెం.మీ కంటే ఎక్కువ వెడల్పు ఉంది. ఈ వింతైన జీవి ఇప్పటివరకూ ఎవరూ చూడలేదు. తొలిసారి శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా ఎన్నో ఇలాంటి వింతైనా.. మానవుడు చూడని అరుదైన జంతుజాంలో సముద్రంలో గూడుకట్టుకొని ఉందని.. కొన్ని మాత్రమే మనం కనుగొన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
-అనకొండలా భారీ రాక్షస చేప

ఇటీవల లాటిన్ అమెరికాలో అరుదైన సముద్ర జీవిని పట్టుకున్నారు. అది స్థానికులలో భయాన్ని కలిగించింది. ఎందుకంటే ఇది భయంకరంగా ఉంది. భారీ చేపను చూసేందుకు ప్రజలు గుమిగూడిన వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. చిలీలోని అరికా నగరంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా.. 16 అడుగుల పొడవైన ఓర్‌ఫిష్‌ను గుర్తించారు. అనకొండ మాదిరిగా రాక్షస ఆకారంలో ఉన్న ఈ భారీ అస్థి చేపను క్రేన్ తో వేలాడదీశారు. ఇది భయంకరంగా ఉంది. స్థానికులు షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు చూసి ఇలాంటివి కూడా సముద్రాల్లో ఉంటాయా? మనుషులను సైతం మింగేసేలా రాక్షసంగా ఉన్న ఇలాంటి వాటిని చూసి అందరూ భయపడ్డ పరిస్థితి నెలకొంది. ఈ ఫొటోలు టిక్‌టాక్‌లో భారీ సంచలనాన్ని సృష్టించాయి.
-మనిషి ఆకారంలో అరుదైన పీత..

రష్యా తీరంలో పట్టుకున్న ఒక పీత అచ్చం మనిషి ఆకారంలో ముఖాన్ని కలిగి ఉంది. దాని ముఖం చూస్తే కోపంగా మనిషి పళ్లు కొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. అది మనిషిని పోలిన పళ్లతో కనిపించడం వల్ల కూడా ఇంటర్నెట్ వైరల్ అయ్యింది. ఈ పీత ఫొటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. క్రస్టేసియన్ ఫోటోగ్రాఫర్ రోమన్ ఫెడోర్ట్సోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అతను పశ్చిమ రష్యాలో ఫిషింగ్ ఓడలో దీన్ని చూసి ఫొటో తీసి షేర్ చేయగా వైరల్ అయ్యింది. “పీతల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో ఆకర్షణీయమైన మరియు అసహ్యకరమైన పీత ఇదేనంటున్నారు. ప్రకృతిలో ఇలాంటి అరుదైన జంతుజాతం ఎన్నో ఉన్నాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్నాయని వీటిని చూసినప్పుడు అర్థమవుతుంది.
-కోతిముఖం ఈల్ చేప

కోతి ముఖంతో పదునైన పళ్లతో వింతగా కనిపించే కుళ్ళిన సముద్ర జీవి యునైటెడ్ స్టేట్స్‌లోని తీరంలో కొట్టుకువచ్చింది. సూది లాంటి పళ్లతో ఉన్న జంతువు తీరంలోని రాళ్ల పై చనిపోయి కనిపించింది.. దాని శరీర భాగాలు కుళ్ళిపోతున్నట్లు కనిపించాయి. ఒరెగాన్‌లోని బ్రూకింగ్స్‌లోని మిల్ బీచ్‌లో ఈ జంతువు బయటపడింది. వికారమైన జీవి మంకీఫేస్ ప్రికిల్‌బ్యాక్ ఈల్ అని పిలువబడే ఒక రకమైన ఈల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సముద్రంలోని ఈ అరుదైన జీవ జాతులను ఇప్పటివరకూ ఎవరూ చూడలేదు. ఇలాంటి సముద్రం నుంచే పుట్టుకొచ్చాయి. కొన్ని చనిపోయి కొట్టుకు వచ్చాయి. సముద్రంలో మనకు తెలియని ఎన్నో జీవ జాతులు ఇప్పటికీ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా గుర్తించని ఎన్నో జంతువులు ఇప్పుడు బయటపడుతున్నాయి. అనేక కారణాల వల్ల సముద్రంలోని అట్టడుగున.. మనిషి చేరుకోలేని చోట భారీగా ఈ వింత జీవులున్నాయి. ఈ జంతువులు కొన్ని సముద్ర తీరానికి కొట్టుకువస్తున్నయి. దీన్ని బట్టి మానవ మేధస్సు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థమవుతోంది.