PM Modi US Tour : మోడీని ప్రశ్నించిన వాల్ స్ట్రీట్ జర్నలిస్ట్ పాకిస్తానీ అమెరికన్ అని తెలుసా?

న్యూయార్క్ టైమ్స్ లో భారత్ కు , మోడీకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాసాలు రాశారు. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకొని భారత్ లో నిల్వ చేసి మిగతావారికి ఎగుమతి చేసి మోసం చేస్తోందని న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. భారత్ సంతతికి చెందిన మాయ అనే జర్నలిస్ట్ కూడా అబద్ధాలతో రాసుకొచ్చింది.

Written By: NARESH, Updated On : June 24, 2023 4:17 pm
Follow us on

PM Modi US Tour : మోడీ అమెరికా యాత్రపై విషం కక్కింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. నిజం చెప్పాలంటే మోడీ అమెరికా యాత్ర.. భారత్-అమెరికా సంబంధాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. టెక్నాలజీ, సెమీ కండక్టర్, డిఫెన్స్, పీపుల్ టు పీపుల్ సంబంధాలు, భారత కాన్సులేట్ లను అమెరికాలో ఏర్పాటు విషయంలో ఇలా ముందుడుగు పడింది. ఇక భారత్ లోనూ అమెరికా కాన్సులేట్ లు అహ్మదాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నారు. ఏ విధంగా చూసుకున్నా మోడీ సక్సెస్ సాధించారు.

191 బిలియన్ డాలర్ల ఒప్పందాలను 500 బిలియన్ డాలర్లకు పెంచాలని అమెరికాతో మోడీ ఒప్పందం చేసుకున్నాడు. అమెరికా – భారత్ కలిసి 58 పేరాల జాయింట్ స్టేట్ మెంట్ ను ఇచ్చారు.

అంత అద్భుతంగా ఒప్పందాలు జరిగాయి భారత్-అమెరికా మధ్య. అమెరికా పార్లమెంట్ లో మోడీ మాట్లాడింది ఓ చరిత్రాత్మకమైన స్పీచ్ అని చెప్పొచ్చు. ఇన్ని విజయాలు చేజిక్కించుకున్న భారత్ కు కొంతమంది జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా మీడియా.. దానికి మద్దతిచ్చే ప్రొగ్రెసివ్ గ్రూపులు మోడీ పర్యటనను బాయ్ కాట్ చేశారు.

న్యూయార్క్ టైమ్స్ లో భారత్ కు , మోడీకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాసాలు రాశారు. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకొని భారత్ లో నిల్వ చేసి మిగతావారికి ఎగుమతి చేసి మోసం చేస్తోందని న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. భారత్ సంతతికి చెందిన మాయ అనే జర్నలిస్ట్ కూడా అబద్ధాలతో రాసుకొచ్చింది. మోడీని విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్నించింది. అమె పాకిస్తానీ అమెరికన్..

మోడీని ప్రశ్నించిన వాల్ స్ట్రీట్ జర్నలిస్ట్ పాకిస్తానీ అమెరికన్ ఎవరు ఎందుకు విషం చిమ్మారు అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.