Tomato Juice Benefits: మారుతున్న ఆహార అలవాట్లు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ ను హెచ్ డీఎల్ అని చెడు కొలెస్ట్రాల్ ను ఎల్ డీఎల్ అని పిలుస్తుంటారు. మన ఆరోగ్యానికి హెచ్ డీఎల్ అవసరమే. కానీ మనం తినే ఆహారాలు మనకు నష్టం కలిగిస్తున్నాయి. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటోంది.
ఈ నేపథ్యంలో మనకు టమాటాలు ఎంతో ఉపయోగపడతాయి. టమాటాల్లో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటంతో ఇవి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సాయపడతాయి. దీంతో మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మన హృదయాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
టమాటా తినడం వల్ల రక్తంలో మలినాలను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఎల్ డీఎల్ పెరగకుండా చేస్తుంది. దీని వల్ల మనకు గుండె జబ్బు, గుండెపోటు రాకుండా నిలువరించడంలో సాయపడతాయి. అందుకే టమాటాలు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే టమాటాలు తినడం చాలా మంచిది.
టమాటా జ్యూస్ తాగితే ఇంకా లాభాలున్నాయి. టమాటా జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పంపడంలో దోహదపడుతుంది. ఈ క్రమంలో టమాటా జ్యూస్ తాగితే మనకు చాలా మేలు కలుగుతుంది. గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టమాటా జ్యూస్ తాగడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు దక్కుతాయి.