Homeజాతీయ వార్తలుKCR Vs Modi Govt: కేంద్రంపై కేసీఆర్ ‘వరి’ పోరు వెనుక షాకింగ్ నిజాలు

KCR Vs Modi Govt: కేంద్రంపై కేసీఆర్ ‘వరి’ పోరు వెనుక షాకింగ్ నిజాలు

KCR Vs Modi Govt:  ‘తెలంగాణ దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం.. కోటి ఎకరాల మాగాణి కావాలి.. మీరు ఎంత ధాన్యం పండించిన కొనే బాధ్యత నాది.. రాష్ట్రంలో పండే ధాన్యంలో 20 శాతం తినడానికే సరిపోతుంది. మరో 10 శాతం మిల్లర్లు, వ్యాపారులు విక్రయించుకుంటారు. మిగిలే 60 శాతం ప్రభుత్వమే కొంటది. కాళేశ్వరం పుణ్యమా అని రాష్ట్రంలో ప్రస్తుతం 70 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి వ్యవసాయ రంగమే ఆదుకుంది.’ ఇవీ.. ఏడాది క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇవి.

KCR Vs Modi Govt
KCR Vs Modi Govt

కాలమానంలో ఏడాది తిరిగింది. అంతే అంతా తలకిందులైంది. పంట కొనాల్సిన ప్రభుత్వం పోరాటం మొదలు పెట్టింది. ‘ ధర్నా చౌక్‌ వద్దన్న ప్రభుత్వమే అదే ధర్నా చౌక్‌లో ధర్నా చేసింది. కేంద్రం ధాన్యం కొంటలేదు.. తిరకాసు పెడుతుంది.. రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనేదాకా కొట్లాడాలి’ ఇవీ వానాకాలం పంట కొనేముందు సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు. తర్వాత వానాకాలం పంట కొనుగోలుకు కేంద్రం ముందుకు రావడంతో వివాదం సద్దు మణిగింది. ప్రస్తుతం యాసంగి పంటలు కోతకు వస్తున్నాయి. మరో 15 రోజుల్లో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై పరిస్థితి తన మెడకు చుట్టుకునేలా ఉందని భావించారు. రెండు రోజుల క్రితం అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సోమవారం ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోలు కోసం కొట్లాట షురూ చేయాలని ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, రైతుబంధు సమితి జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు.

-కొనుగోలు కేంద్రాలే ఉండవని.. కొట్లాట ఎందుకో..
రాష్ట్రంలో పండిన పారాబాయిల్డ్‌ రైస్‌ కేంద్రానికి అమ్మమని స్వయంగా ఎఫ్‌సీఐకి లేఖ ఇచ్చి వర్చిన కేసీఆర్‌ ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరికీ చెప్పలేదు. సంతకం పెట్టే ముందు ఎవరినీ అడగలేదు. కనీసం కేబినెట మీటింగ్‌లోనూ చర్చింలేదు. ఏకపక్షంగా సంతకం చేశారు. వానాకాలం వడ్ల కొనుగోలు లొల్లి మొదలు కావడంతో కేంద్రం కేసీఆర్‌ లేఖను బయట పెట్టింది. దీంతో కేసీఆర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో వ్యతిరేఖ భావన ఏర్పడింది. టీఆరఎస్‌ శ్రేణులు కూడా ఆశ్చర్చపోయాయి. దీంతో ఆందోళన చెందిన కేసీఆర్‌ తేరుకుని ప్రెస్‌మీట్‌ పెట్టారు. కేంద్రం తన మొడపై కత్తిపెట్టి బలవంతంగా పారాబాయిల్డ్‌ రైస్‌ కొనమని సంతకం చేయించుకుందని తెలిపాడు. కానీ సంతకం పెట్టే ముందు ఎవరిని అడిగావు.. కేంద్రం ఒత్తిడి చేసినప్పుడు ఆ విషయం రాష్ట్రటంలోని రైతులకు ఎందుకు చెప్పలేదు అంటే దానికి సీఎం దగ్గర సమాధానం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యం మొత్తం మిల్లర్లు పారాబాయిల్డ్‌ బియ్యంగానే మిల్లింగ్‌ చేస్తారు.

Also Read: Pawan Kalyan Somu Veeraju: కలిసి సాగితే బీజేపీ-జనసేనకు కలదు విజయం

-రైతులను వద్దని.. తాను పండించి..
ఈ నేపథ్యంలో కేంద్రం యాసంగి ధాన్యం కొనదని, ఎవరూ వరి వేయొద్దని కేసీఆర్‌ సూచించారు. కానీ కేసీఆర్‌ మాత్రం తన ఫాం హౌస్‌లో 150 ఎకరాల్లో వరి సాగుచేశాడు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బయట పెట్టారు. దీంతో రైతుల్లో కేసీఆర్‌పై మరింత వ్యతిరేక భావం ఏర్పడింది. ఈ విషయం యాసంగి సాగు ప్రారంభంలోనే వెలుగు చూడడంతో ఆలస్యంగా అయినా చాలామంది రైతులలు మళ్లీ వరి వేశారు. కేసీఆర్‌ ధాన్యం కొనేవారే తమ ధాన్యం కొంటారనే నిర్ణయానికి వచ్చారు.

-కేంద్రం వద్ద సీఎం లేఖ..
పారాబాయిల్డ్‌ రైస్‌ ఎఫ్‌సీఐ కి ఇవ్వమని సీఎం కేసీఆర్‌ సంతకం చేసిన లేక ప్రస్తతం కేంద్రం చేతులో ఉంది. ఇప్పుడు ధాన్యం కొనమని అడిగితే ఆ లేఖనే ఆధారం చూపి కేంద్రం నిరాకరించవచ్చు. మరోవైపు రాష్ట్రంలో మరో 15 రోజుల్లో దాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒత్తిడికి లోనైన కేసీఆర్‌ మళ్లీ వడ్డ కొనుగోలు అంశం కేంద్రంపై నెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్రంలో వరి పోరు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో రైతులనూ కలుపుకుపోవాలని సూచించారు. కేవలం 10 వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలో అందరి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసేందుకు కేవలం రూ.10 వేల కోట్లు కేటాయించలేని పరిస్థితి ఉండడం మాత్రం నిజంగా దౌర్భాగ్యమే.

-మిల్లర్ల కోసమే..
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా రైతు. రాష్ట్రంలో నేలల పరిస్థితి, వాతావరణ పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఎఫ్‌సీఐకి యాసంగిలో పారాబాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని సంతకం చేశారు. కానీ తాజాగా వరి పోరు ఎవరి కోసం చేస్తున్నారంటే కేవలం మిల్లర్ల కోసమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిల్లర్లలో చాలామంది టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే. పార్టీకి ఎన్నికల సమయంలో ఫైనాన్స్‌ చేసేదీ వారే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ రైతులను అడ్డం పెట్టుకుని మిల్లర్లకు మేలు చేసేందుకే కేంద్రంపై వరి పోరు చేయాలని నిర్ణయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: Jr NTR: చిరంజీవి ఎవరో నాకు తెలియదు అన్న ఎన్టీఆర్ కి నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా ?

Recommended Video:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] Yadadri Bhuvanagiri: ఓ బాలిక పేర రాసిన ఉత్తరం కలకలం రేపింది. అందరిని హడావిడి చేసింది. పరుగులు తీయించింది. ఏదో జరిగిందనే ఉద్దేశంతో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు నానా హంగామా చేశారు. అసలే విద్యార్థినులు కావడంతో అధికారుల్లో ఆందోళన పెరిగింది. ఏం జరిగిందోననే బెంగతో అందరు కంగారు పడ్డారు. కానీ చివరకు అది ఓ ఫేక్ లెటర్ అని తేలడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. చివరకు నిందితుడిపై చర్యలకు ఉపక్రమించినా అతడికి గుండె సంబంధ వ్యాధి ఉందని గ్రహించి వదిలేసిన ఘటన చోటుచేసుకుంది. […]

  2. […] Balakrishna PA Arrest: సహజంగా యజమానులకంటే పీఏలకే అధికారాలు ఎక్కువ. వారు లేనిదే ఏ పని జరగదు. ఎక్కడి నుంచైనా పరిచయాలు పెంచుకుని వ్యవహారాలు చక్కబెట్టడంలో పీఏలదే ప్రత్యేక స్థానం. కానీ వారే అడ్డదారులు తొక్కుతుంటారు. తమ యజమానుల పరువు తీస్తుంటారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తూ చివరకు తలవంపులు తెస్తుంటారు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా తమకు సంబంధం లేదు జల్సాలే ముఖ్యమని గ్రహించి ఎలాంటి పనికిమాలిన పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పీఏ బాలాజీ బాగోతం కూడా వెలుగులోకి రావడం గమనార్హం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular