Train Carriages Lines: మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా రైలు ప్రయాణం చేసి ఉంటారు. బస్, విమానంతో పోల్చి చూస్తే రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అయితే రైలు ప్రయాణం చేసేవాళ్లకు రైలు బోగీలపై కొన్ని గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గీతల గురించి మనలో చాలామంది పట్టించుకోరు. అయితే రైలు బోగీలపై ఉండే గీతల వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి.

రైలు బోగీలపై ముఖ్యంగా తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో గీతలు కనిపిస్తూ ఉంటాయి. బ్లూ కలర్ ఐసిఎఫ్ కోచ్ పై తెలుపు రంగు గీతలు ఉంటే ఆ బోగీ జనరల్ బోగీ అని ఆ బోగీలో ఎవరైనా ప్రయాణం చేయవచ్చని అర్థం. తెలుగు రంగు గీతలు ఉండే బోగీలలో సీట్లను రిజర్వేషన్ చేయరని గుర్తుంచుకోవాలి. ఒకవేళ తెలుపు రంగులో కాకుండా పసుపు రంగులో రైలు బోగీపై గీతలు ఉంటే ఆ బోగీ అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, దివ్యాంగులకు కేటాయించారని అర్థం చేసుకోవాలి.
Also Read: Petrol Diesel Price Hike: అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయే.. మోడీ సార్ వీర బాదుడు మొదలాయే
ఒకవేళ రైలు బోగీలపై ఈ రెండు రంగులలో కాకుండా గ్రీన్ కలర్ లేదా గ్రే కలర్ లో బోగీలు ఉంటే మాత్రం ఆ బోగీలు మహిళలకు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. రైలులో మొదట లేదా చివర మాత్రమే ఈ తరహా బోగీలు ఎక్కువగా కనిపిస్తాయి. రైలు బోగీలపై గ్రే కలర్ పై ఎరుపు రంగు గీతలు ఉంటే మాత్రం అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అని అర్థం చేసుకోవాలి. రైలు ప్రయాణం చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

బస్సు, విమాన ప్రయాణాలతో పోల్చి చూస్తే రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో పాటు టికెట్ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. రైలు బోగీలపై ఏ రంగు గీతలు దేనికి సంకేతమో తెలుసుకోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడే ఛాన్స్ ఉండదు.
Also Read: Virata Parvam Movie: ఇంకా అజ్ఞాతంలోనే మగ్గిపోతున్న ‘విరాటపర్వం’