కోవీషీల్డ్, కోవాగ్జిన్ మిక్సింగ్ తో రిజల్ట్ ఇదీ

కరోనా ప్రపంచంలో విలయతాండవం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో టీకాలు వేసేందుకు ప్రభుత్వాలు సంకల్పించినా లక్షం ఇంకా నెరవేరడం లేదు. దీంతో వేర్వేరు వ్యాక్సిన్ల వాడకం పెరిగిపోతోంది. అయినా వైరస్ తన ప్రభావం తగ్గడం లేదు. కరోనా రకాలను అడ్డుకోవడానికి శాస్ర్తవేత్తలు సూచించిన మార్గాలను పాటిస్తున్నా ఇంకా భయం మాత్రం వీడడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా విజృంభనపై ఇప్పటికే పలు హెచ్చరికలు వస్తున్నాయి. త్వరలో మూడో దశ ముప్పు పొంచి ఉందని చెబుతున్న క్రమంలో […]

Written By: Srinivas, Updated On : August 8, 2021 7:11 pm
Follow us on

కరోనా ప్రపంచంలో విలయతాండవం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో టీకాలు వేసేందుకు ప్రభుత్వాలు సంకల్పించినా లక్షం ఇంకా నెరవేరడం లేదు. దీంతో వేర్వేరు వ్యాక్సిన్ల వాడకం పెరిగిపోతోంది. అయినా వైరస్ తన ప్రభావం తగ్గడం లేదు. కరోనా రకాలను అడ్డుకోవడానికి శాస్ర్తవేత్తలు సూచించిన మార్గాలను పాటిస్తున్నా ఇంకా భయం మాత్రం వీడడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా విజృంభనపై ఇప్పటికే పలు హెచ్చరికలు వస్తున్నాయి. త్వరలో మూడో దశ ముప్పు పొంచి ఉందని చెబుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సిందే అని చెబుతున్నారు.

అస్టాజనికా, ఫైజర్ టీకాలపై బ్రిటన్ లో అధ్యయనం సాగుతోంది. భారత్ లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు వేస్తూ ప్రజలను వైరస్ బారి నుంచి రక్షిస్తున్నారు. ఈటీకాలు వాడడం సురక్షితమేనని భారత శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. కరోనాను ఎదుర్కొనే క్రమలో రోగనిరోధక శక్తి పెంచుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని తేలింది. ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో రెండు నెలల క్రితం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఒకే వ్యక్తికి రెండు వేర్వేరుగా ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనా దీనిపై వైద్య నిపుణులు అధ్యయనం చేశారు. దీంతో ఒకే వ్యక్తికి వేర్వేరు డోసుల్లో రెండు వ్యాక్సిన్లను తీసుకోవడం సురక్షితమేనని అధ్యయనం పేర్కొంది.

కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తిని పెంచుకునే క్రమంలో మన ఇమ్యూనిటీని పెంచుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ల కొరత వల్ల టీకాల పంపిణీ వేగవంతంగా జరగకపోవడంతో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. జులై 30న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల మిశ్రమ పద్ధతిలో వాడటం, వాట ఫలితాలను అంచనా వేసేందుకు ఓ అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. దేశలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,455 కు చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన 491 మంది చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,27,862 కు పెరిగింది.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822 కు చేరింది. కరోనా వైరస్ తగ్గడంతో 43,910 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్ కేసుల శాతం 1.27గా ఉంది. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. మరణాల శాతం 1.34 శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య 50.68 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 55,91,657 మంది టీకా తీసుకున్నారు. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండేది. గతేడాది సమ్మర్ లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్ వేవ్ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.