అరెరే.. సినిమాలు హిట్, హీరోయిన్ ఫట్ !

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కి మొదటి నుంచి అవకాశాలు రాలేదు. ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా.. ఎందుకో టాలీవుడ్ మేకర్స్ మాత్రం ప్రియాంక జవాల్కర్ ను చిన్న చూపే చూశారు. అందుకే, చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రియాంక జవాల్కర్. అయితే అదృష్టం కలిసి వచ్చి.. ఆమె చేసిన రెండు చిన్న సినిమాల పై మంచి బజ్ వచ్చింది. పైగా ఆ రెండు సినిమాలు ‘తిమ్మరుసు’, ‘SR […]

Written By: admin, Updated On : August 8, 2021 6:55 pm
Follow us on

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కి మొదటి నుంచి అవకాశాలు రాలేదు. ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా.. ఎందుకో టాలీవుడ్ మేకర్స్ మాత్రం ప్రియాంక జవాల్కర్ ను చిన్న చూపే చూశారు. అందుకే, చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రియాంక జవాల్కర్. అయితే అదృష్టం కలిసి వచ్చి.. ఆమె చేసిన రెండు చిన్న సినిమాల పై మంచి బజ్ వచ్చింది.

పైగా ఆ రెండు సినిమాలు ‘తిమ్మరుసు’, ‘SR కల్యాణమండపం’ కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలకు పర్వాలేదు అనే టాక్ వచ్చింది. ముఖ్యంగా ‘SR కళ్యాణమండపం’కు ప్రేక్షకుల వైపు నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఆ రకంగా వరుసగా రెండు సినిమాలతో హల్ చల్ చేసింది ఈ అనంతపురం అమ్మడు.

కానీ, విచిత్రంగా ఈ రెండు సినిమాలు ప్రియాంక జవాల్కర్ ఏ రకంగానూ ప్లస్ కాలేదు. పైగా ప్లస్ కాకపోగా పెద్ద మైనస్ అయింది. ఈ సినిమాలు రిలీజ్ కి ముందు ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు తీరా ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక, ఆమెకు వచ్చిన ఆ ఆఫర్లు కూడా వెనక్కి పోయినట్లు తెలుస్తోంది.

కారణం.. ఈ రెండు సినిమాల్లోనూ ప్రియాంక అప్పియరెన్స్ బాగాలేదని, ఆమె చాలా లావుగా కనిపించిందని.. అలాగే ప్రియాంక మేకప్ తో పాటు ఆమె స్టైలింగ్ కూడా సరిగ్గా లేదని.. ప్రియాంక జవాల్కర్ పై సినీ జనంలో బాగా నెగిటివ్ కామెంట్స్ పడ్డాయి. అందుకే, ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఆమెకు ఛాన్స్ లు ఇచ్చిన మేకర్స్.

పాపం, నిజానికి ప్రియాంక ఈ మధ్య బాగానే సన్నబడింది. ఇన్ స్టాగ్రామ్ లో స్లిమ్ గా కనిపిస్తున్న ఫోటోలను కూడా తరుచూ పోస్ట్ చేస్తోంది. కానీ, బయట ప్రియాంక లుక్ కి, వెండితెర పై ప్రియాంక లుక్ కి చాలా తేడా ఉందట. అందుకే, ఈ తెలుగు అమ్మాయికి అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు.