Tollywood: ఈ డైరెక్టర్లు తీసిన మొదటి సినిమాలోని హీరోయిన్లు ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే…

హీరోయిన్ గా రాణించలేకపోయారు. ఇక ఒక సినిమా సక్సెస్ వస్తే సినిమా ఆఫర్లు భారీ గా వస్తాయి.అందులో ఏ సినిమా చేస్తే బాగుంటుంది, ఏ సినిమా వదిలేస్తే మనం సేఫ్ జోన్ లో ఉంటాం అనేది ఆలోచించు కుంటే మంచిది లేకపోతే ఎప్పటికీ వాళ్ళు సక్సెస్ కాలేరు.

Written By: Gopi, Updated On : December 7, 2023 8:33 am

Tollywood

Follow us on

Tollywood: ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకులుగా పేరుపొందిన రాజమౌళి, సుకుమార్, వి వి వినాయక్ లాంటి డైరెక్టర్లు తీసిన మొదటి సినిమాల్లో హీరోలకి మంచి పేరు వచ్చింది. అలాగే హీరోయిన్లకు కూడా మంచి పేరు వచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కువకాలం సినిమా ఇండస్ట్రీలో నిలవలేకపోయారు. దానికి కారణం ఏంటి అంటే మొదటి సినిమాతో మంచి హిట్ రాగానే ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో వాళ్ళు ఏ సినిమా చెయ్యాలి ఏ సినిమా చెయ్యకూడదు అని సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో ఫేలయ్యారు.

అందుకే వాళ్లు హీరోయిన్ గా రాణించలేకపోయారు. ఇక ఒక సినిమా సక్సెస్ వస్తే సినిమా ఆఫర్లు భారీ గా వస్తాయి.అందులో ఏ సినిమా చేస్తే బాగుంటుంది, ఏ సినిమా వదిలేస్తే మనం సేఫ్ జోన్ లో ఉంటాం అనేది ఆలోచించు కుంటే మంచిది లేకపోతే ఎప్పటికీ వాళ్ళు సక్సెస్ కాలేరు…

ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో హీరోయిన్ గా గజలా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇక ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ సాధించలేదు. దాంతో ఆమె తొందరగానే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది…

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. హీరోయిన్ గా నటించిన అను మెహతా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదటి సినిమా తోనే ఒక మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కాకపోవడం తో ఆమెకి పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. దాంతో ఇండస్ట్రీ నుంచి ఆమె ఫేడ్ ఔట్ అవ్వాల్సి వచ్చింది…

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వి వి వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా ఆది ఈ సినిమాతో హీరో గా ఎన్టీయార్ డైరెక్టర్ వినాయక్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.ఇక వీళ్ళతో పాటు గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తిచావ్లా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇక దాంతోపాటుగా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ఒకసారి హిట్ వచ్చిన తర్వాత చేసే సినిమాలు సెలెక్ట్ చేసుకుని చేస్తే బాగుంటుంది లేకపోతే ఇలానే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అవ్వాల్సి వస్తుంది…