https://oktelugu.com/

లక్ అంటే ఈ కుక్కదే.. ఏకంగా రూ.36 కోట్ల ఆస్తి..?

ఇతర జంతువులతో పోలిస్తే విశ్వాసం ఉన్న జంతువుగా కుక్కకు పేరుంది. కుక్కలపై ఆదరణ చూపిస్తే అవి మనల్ని వెంటపెట్టుకుని ఉండటంతో పాటు ఏవైనా ఆపదలు ఎదురైన సమయంలో కొన్నిసార్లు రక్షిస్తాయి. అందువల్ల కొంతమంది కుక్కలను కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం కుక్కపై ఉన్న ప్రేమతో ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. మన దేశ కరెన్సీ ప్రకారం ఆ కుక్కకు 36 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అమెరికాలోని టేన్నసీలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 13, 2021 / 06:46 PM IST
    Follow us on

    ఇతర జంతువులతో పోలిస్తే విశ్వాసం ఉన్న జంతువుగా కుక్కకు పేరుంది. కుక్కలపై ఆదరణ చూపిస్తే అవి మనల్ని వెంటపెట్టుకుని ఉండటంతో పాటు ఏవైనా ఆపదలు ఎదురైన సమయంలో కొన్నిసార్లు
    రక్షిస్తాయి. అందువల్ల కొంతమంది కుక్కలను కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం కుక్కపై ఉన్న ప్రేమతో ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు. మన దేశ కరెన్సీ ప్రకారం ఆ కుక్కకు 36 కోట్ల రూపాయల ఆస్తి ఉంది.

    అమెరికాలోని టేన్నసీలో ఒక వ్యక్తి కుక్కకు 36 కోట్ల రూపాయల ఆస్తి రాసిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే టేన్నసీకి చెందిన బిల్‌ డోరిస్‌ అనే 84 సంవత్సరాల వ్యక్తి గడిచిన ఎనిమిది సంవత్సరాలు లులు అనే కుక్కను పెంచుకునేవాడు. బిల్ డోరిస్ కు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కుక్కపైనే అమితమైన ప్రేమను చూపించేవాడు. ఎప్పుడైనా ఊరికి వెళ్లే సమయంలో బిల్ డోరిస్ కుక్కను స్నేహితుడు మార్ట్ బర్టన్ దగ్గర వదిలేసేవాడు.

    అయితే డోరిస్ తన మరణానంతరం తన ఆస్తి అంతా కుక్కకు చెందాలని భావించి ఆ కుక్కకు ఆస్తి చెందేలా వీలునామా రాశాడు. అలా వీలునామా రాసిన కొన్ని రోజులకే డోరిస్ మృతి చెందాడు. డోరిస్ తన వీలునామాలో లులు సంరక్షణకు, దాని అవసరాలు తీర్చడం కోసం ఈ డబ్బును ఖర్చు పెట్టాలని డోరిస్ పేర్కొన్నారు. తన స్నేహితుడు మార్ట్‌ లులు బాధ్యతలను తీసుకోవాలని డోరిస్ పేర్కొన్నారు.

    మార్ట్‌‌ వీలునామా గురించి మాట్లాడుతూ డోరిస్‌ రాసిన వీలునామా చదివి తాను ఎంతో ఆశ్చర్యపోయానని వెల్లడించారు. ఆ వీలునామా చూసిన తరువాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు. డోరిస్ లులును కన్నబిడ్డలా చూసుకునేవాడని తెలిపారు.