Srinivasa Ramanujan Birth Anniversary: గణిత సిద్ధాంతాల మేధావి.. అతి చిన్న వయసులోనే ఎన్నో గణిత సమస్యలను పరిష్కించిన గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్. ఈయన గుణింతాలను అవపోసన పట్టాడు. సొంతంగా కొన్ని సిద్ధాంతాలను రూపొందించి ప్రపంచంలోని గొప్ప మేధావుల చేత ప్రశంసలు అందుకున్నాడు.. అపారమైన మేధస్సుతో భారతకీర్తిని ప్రపంచ శిఖరాలపై ఎగరవేసిన ఈయన కనిపెట్టిన ‘లెక్కలు’ సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాయి. ‘ఆయిలర్’ సూత్రాలు, ‘త్రికోణమితి’కి చెందిన అనేక సమస్యలను సులువుగా పరిష్కరించేవారు. తాను చదువుకునే స్కూల్లో టీచర్లకు పాఠాలు చెప్పే విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఉపాధ్యాయులు కొన్ని గణిత సమస్యల కోసం కష్టపడుతుంటే రామానుజం సులువుగా పరిష్కరించేవారు. అంతటి మేధస్సు కలిగిన శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్ లో జన్మించారు. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజన్ చిన్న వయసులోనే గణితంలో అసాధారణ బాలుడిగా గుర్తింపు పొందారు. తాను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జార్జ్ స్కూచ్ సిడ్జ్ కార్ రాసిన ‘సినాప్సిన్’ అనే బుక్ చదివాడు. దీంతో ఈ పుస్తకం రామానుజం జీవితాన్నే మార్చేసింది. అందులోని ఆల్ జిబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. అయితే వీటిని పెద్ద పెద్ద గణిత మేధావులు సైతం అర్థం చేసుకోలేకపోయారు. అయితే రామానుజం మాత్రం వాటిని సులువుగా పరిష్కరించేవారు.
రామానుజంకు చిన్నప్పుడే పెళ్లయింది. లెక్కలు బాగా చేస్తున్న తన కొడుకు పిచ్చివాడైపోతాడేమోనన్న భయంతో ఆయన తండ్రి రామానుజంను 1903లో ఇంటి పెద్దను చేశారు. అయితే పెళ్లి చేసుకున్న తరువాత ఆయనకు పూట గడవడం కష్టంగా మారింది. దీంతో 25 రూపాయల వేతనం మీద గుమాస్తాగా పనిచేశాడు. అయితే గణితంను మాత్రం విడిచిపెట్టలేదు. గణితంలో ఆయన చేసిన పద్ధతులను చూసి డిగ్రీ లేకపోయినా మద్రాస్ విశ్వవిద్యాలయం ఆయనకు 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో కేంబ్రిడ్జి గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డికి పంపారు. దీంతో రామానుజనాన్ని యూనివర్సిటికీ ఆహ్వానించారు.
Also Read: సాయంత్రం లేని తెలంగాణలోని ఈ ఊరి గురించి తెలుసా..?
ఆయన మేధా సంపత్తిని చూసి వారు మరిసిపోయారు. ఆ తరువాత రామానుజం 1914 మార్చి 17న ఇంగ్లాండ్ వెళ్లారు. అయితే ఇంగ్లాండ్ లో ఫుడ్ నచ్చక ఆయన సొంతంగా వంట చేసుకునేవారు. మరోవైపు విశ్రాంతి లేకుండా పరిశోధనలు చేయడంతో పాటు వాతావరణం పడకపోవడంతో రామానుజం ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. అయినా 32 పరిశోధనా పత్రాలను సమర్పించారు. అయితే అప్పటి నుంచి రామానుజం ఆరోగ్యం క్షీణించసాగింది. అనారోగ్యంతోనే ఇండియాకు వచ్చిన ఆయనను చూసి అభిమానులు చలించిపోయారు. ఎన్నో రకాల వైద్య సదుపాయాలు అందించినా చివరికి 1926 ఏప్రిల్ 26న మరణించారు.
1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు హార్డీ రామానుజంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నా కారు నెంబర్ 1729 దాని ప్రత్యేకత ఏదైనా ఉందా..? అని అడిగారు. దీంతో రామానుజం ఇది అతి ముఖ్యమైన సంఖ్య అని తెలిపారు. రెండు విధాలుగా, రెండు ఘనముల మొత్తంగా రాయొచ్చని తెలిపారు. అంటే 1729=1^3+12^3=9^3+10^3 అని అర్థం అని చెప్పడంతో హార్డి ఆశ్చర్యపోయారు. ఇక రామానుజన్ చేసిన సేవలకు ఎన్నో గౌరవాలను పొందారు. 1918లో ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కారు. కాగా రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై ఇప్పటికీ అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీలో రీసెర్ఛ్ జరుగుతోంది.
Also Read: ఐటీ సంస్థల్లో ఇక నుంచి హైబ్రిడ్ విధానమేనా?