https://oktelugu.com/

కరోనా తెచ్చిన బద్ధకం!

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వివిధ దేశాల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వివిధ దేశాలలో రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ప్రజలను ఇళ్లలోనే ఉండమని తమ ప్రసంగాలు, ప్రకటనల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. కొంత మంది ఇంట్లో హాయిగా కుర్చీలో కూర్చుని టీవీలో ఇష్టమైన కార్యక్రమం చూస్తూ ఉండటానికి ఇబ్బంది ఏమిటని కూడా ప్రశ్నించారు. మనకు చేయడానికి అంతగా ఆసక్తి లేని కొన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 7, 2020 / 04:13 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వివిధ దేశాల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వివిధ దేశాలలో రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ప్రజలను ఇళ్లలోనే ఉండమని తమ ప్రసంగాలు, ప్రకటనల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. కొంత మంది ఇంట్లో హాయిగా కుర్చీలో కూర్చుని టీవీలో ఇష్టమైన కార్యక్రమం చూస్తూ ఉండటానికి ఇబ్బంది ఏమిటని కూడా ప్రశ్నించారు.

    మనకు చేయడానికి అంతగా ఆసక్తి లేని కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించమని, వ్యాయామం చేయమని , ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోమని చెబుతున్న ఆరోగ్య సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఇవన్నీ మనలో బద్ధకాన్ని తట్టి లేపే ఆలోచనలకు ఊతమిస్తాయి. కానీ, వీటిని పాటించడం అంత సులభమేమీ కాదు. లాక్ డౌన్ లో కొన్ని రోజులు గడిచేటప్పటికే ఇవన్నీ చేయడం కష్టమని తేలిపోతుంది.

    నిజానికి మానవ శరీరం పని చేయడం వల్ల, పనికి, విశ్రాంతికి మధ్య ఒక సమతుల్యత పాటించడం వల్లనే ఎక్కువ ఉత్తేజితంగా ఉంటుంది. మనం ఎప్పుడూ సులభంగా పూర్తయిపోయే పనుల వైపు మొగ్గు చూపడం సహజం. రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నప్పుడు లేచి వెళ్లి టీవీ లో చానళ్ళు మార్చాలని అనుకోము. కారు ఉండగా సైకిల్ మీద ఎందుకు సూపర్ మార్కెట్ కి వెళతాం? మీ సహోద్యోగి కన్నా సగం పని చేయగలిగే వెసులుబాటు మీకున్నప్పుడు అంత కన్నా ఏమి కావాలి? ఏ పనిలోనైనా మానసిక, శారీరక శక్తి ఖర్చవుతుంది. ఎక్కడ వీలయితే అక్కడ అధికంగా శ్రమ పడటాన్ని తప్పించుకుంటూ ఉంటాం.

    ఏ పనీ చేయకుండా, సీలింగ్ వైపు చూస్తూ, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ గడపాలని మీరెప్పుడైనా కలలు కన్నారా? ఇది వినడానికి అందంగా ఉంటుంది కానీ, అలా ఉండటం వలన ఎటువంటి ఆనందం ఉండదు. వర్జీనియా యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో కొంత మంది వ్యక్తులను ఫోన్, పుస్తకాలు, టీవీ లేని ఒక గదిలోకి పంపించి వారిపై అధ్యయనం చేశారు..ఆ సమయంలో వారు ఏ పనీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. వారికి ఎలక్ట్రిక్ షాక్ తీసుకునేందుకు ఒక పరికరాన్ని అమర్చారు.

    వారికి, ఒక వేళ ఎలక్ట్రిక్ షాక్ తగలాలంటే ఏ స్విచ్ నొక్కాలో వివరించారు. ఒక్కసారి ప్రయత్నించాక రెండవ సారి ప్రయత్నించలని మీరనుకుంటే పొరపాటే. అలా ఒంటరిగా ఉన్నప్పుడు 71 శాతం మంది పురుషులు, 25 శాతం మంది మహిళలు కనీసం ఒక్క సారన్నా ఎలక్ట్రిక్ షాక్ పెట్టుకున్నారు. ఒక వ్యక్తి అయితే కనీసం 190 సార్లు తనని తాను షాక్ కి గురి చేసుకున్నారు. చాలా మంది వేరే ఆలోచనలు రాకుండా తమని తాము హింసించుకున్నారు. కొన్ని సార్లు మనం పరిస్థితులను తేలికగా తీసుకుంటాం. కానీ, మనం ఎక్కువ శ్రమించాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు ఎక్కువ విలువిస్తాం. కరోనా పుణ్యమా అని అనేక మంది శ్రమపడటంలో నిమగ్నమయ్యారు.