Putin Modi meeting: మనం బాగుపడితే చాలు ఎవడు ఏమైతే మనకేంది అనుకునేవారు ప్రపచంలో చాలా మంది ఉన్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కోవకు చెందినవాడే. అందకే ఆయన ఎన్నికల్లో కూడా అమెరికా ఫస్ట్ నినాదంతో గెలిచారు. అమెరికా కోసం ప్రపంచ దేశాల దిగుమతులపై టారిఫ్‌లు విధించారు. ఇక ప్రపంచంలో ఏ దేశం ఎదిగినా అమెరికాకు కడపు మంట ఆగదు. అందుకే ట్రంప్ ఇటీవల మన ఎకానమీని డెడ్ ఎకానమీ అని ఏడుపు మొదలు పెట్టాడు. ఆయన ఏడుపు పుణ్యమో ఏమో మన రూపాయి పతనం అవుతోంది. ఇక ఇదే సమయంలో రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. ‘భారత–రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవి, ఎవరికీ వ్యతిరేకం కాదు‘ అని ప్రకటించారు.
వాళ్లు చేస్తే తప్పు లేదు..
పుతిన్ ‘అమెరికా రష్యా చమురు కొనకుండా ఆపమని చెప్తుంటే, వారు మా అణు ఇంధనం కొంటున్నారు కదా?‘ అని ప్రశ్నించారు. భారత్ రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూ దౌత్య స్వతంత్రత్వాన్ని కాపాడుతోందని స్పష్టం చేశారు. పాశ్చాత్య ఆంక్షలు ఇరుదేశాల బంధాన్ని బలహీనపరచలేవని ధైర్యంగా ప్రకటించారు.
భారత దౌత్య విజయం
మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగకుండా రష్యాతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలు కొనసాగిస్తోంది. చైనా, పాకిస్తాన్‌కు కూడా ఈ ప్రకటన హెచ్చరికగా మారింది. భారత్ స్వయం శక్తిగా అవతరించి, ప్రపంచ దేశాలు సంబంధాల కోసం ముందుకు రావాలని పుతిన్ సందేశం.
పుతిన్ పర్యటన సందర్భంగా జరిగే ఒప్పందాలు అమెరికా, యూరోప్ దేశాల స్పందనలకు దారితీస్తాయి. భారత్ దౌత్య విధానం ద్వంద్వ స్థితిని అధిగమించి స్వతంత్రంగా ముందుకు సాగుతోంది. ట్రంప్ తన సొంత ఎజెండాతో భారత్‌ను అణచివేయాలని చూస్తున్నారు. కానీ మోదీ మౌనంగా అన్నింటికీ సమాధానం ఇస్తున్నారు. ఇక భారత గడ్డపై పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇటు ట్రంప్‌తోపాటు, పాకిస్తాన్, చైనాకు కూడా ఒక హెచ్చరిక. ఇపుడు భారత్ స్వయం శక్తిగా అవతరించింది. ఏ దేశమైనా భారత్ తో సంబంధాల కోసం ముందుకు రావల్సిందే.