రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..

మోకా భాస్కర రావు హత్య కేసుతో సంబంధం ఉందంటూ అరెస్టైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రవీంద్రతో పాటు ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతా నాంచారయ్య మరియు మరో నలుగురిని మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నేడు జైలుకి తరలించారు. ఈ హత్య కేసులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నారు. జులై 29న వైసీపీ నేత మరియు మంత్రి పేర్ని నాని అనుచరుడైన మోకా భాస్కర రావుని మచిలీపట్నం […]

Written By: Neelambaram, Updated On : July 7, 2020 4:34 pm
Follow us on


మోకా భాస్కర రావు హత్య కేసుతో సంబంధం ఉందంటూ అరెస్టైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రవీంద్రతో పాటు ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతా నాంచారయ్య మరియు మరో నలుగురిని మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నేడు జైలుకి తరలించారు. ఈ హత్య కేసులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నారు. జులై 29న వైసీపీ నేత మరియు మంత్రి పేర్ని నాని అనుచరుడైన మోకా భాస్కర రావుని మచిలీపట్నం ఫిష్ మార్కెట్ లో అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది. మొదట ఇది పాత కక్షలు, ఆస్థి వివాదాల కారణంగా జరిగిన హత్యగా భావించగా, విచారణలో రాజకీయ హత్య అని తేలింది. అలాగే కొల్లు రవీంద్రకు ఈ హత్యతో ప్రమేయం ఉందని బయటపడింది.

వైసీపీ నేతల జేబులు నింపుతున్న మద్యం విధానం

మోకా భాస్కర్ రావు హత్యకు పథకం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ సంభాషణల ఆధారంగా కీలక ఆధారాలతో రవీంద్రను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ హత్య అధికార విపక్షాల మధ్య అగ్గి రాజేసింది. మోకా భాస్కర్ రావు ఒక రౌడీ షీటర్ అని, గతంలో చింతా నాంచారయ్య అన్నయ్య మర్డర్ తో ఆయనకు సంబంధం ఉంది అన్నారు. ఇది పాత కక్షల కారణంగా జరిగిన హత్య కాగా కొల్లు రవీంద్రను కుట్ర పూరితంగా ఇరికించారని అంటున్నారు. ఇక హత్య చేసిన రోజే నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని, రవీంద్రను ఇరికించడానికి వైసీపీ ప్రభుత్వం పోలీసులతో తప్పుడు సమాచారం ఇప్పిస్తున్నారు అన్నారు.

పవన్ ప్రణాళిక మొత్తం చెడేలా ఉందే..!

మరో వైపు హత్య కేసులో అడ్డంగా దొరికిన కొల్లు రవీంద్రను బీసీ కార్డు తో కాపాడాలని టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. పూర్తి ఆధారాలతో పట్టుబడిన కొల్లు రవీంద్ర తప్పించుకోలేదని వారు గట్టిగా చెవుతున్నారు. ఇక కేసు విషయంలో బలమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తుండగా…కొల్లు రవీంద్రకు శిక్ష పడడం ఖాయం అంటున్నారు. కాగా కొల్లు రవీంద్ర లాయర్లు ఆయనను బెయిల్ పై బయటకు త్వరగా తేవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ మాజీ మంత్రి అయిన కొల్లు రవీంద్రను సెంట్రల్ జైల్లో బాబు. లోకేష్ కలిసి పరామర్శించనున్నారట.