Skanda First Review : బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న తాజా స్కంద చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా, థియేట్రకల్ బిజినెస్ మరియు నాన్-థియేట్రికల్ బిజినెస్ రెండూ ఈ సినిమాకు బాగా జరగడంతో హైప్ నెలకొంది.. స్టార్ హీరో సినిమా ఏ రేంజ్ లో జరిగిందో అదే రేంజ్ లో జరిగింది. ఆ స్థాయిలో ఈ సినిమాకు డిమాండ్ ఉంది.
ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్ ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. అంతేకాదు సినిమాపై అంచనాలు పెంచేశాయి.
కమర్షియల్ సినిమాలు రొటీన్‌గా భావించే ప్రేక్షకులకు నచ్చకపోయినా మాస్ ప్రేక్షకులకు మాత్రం ఇది నచ్చింది.
ఇదిలావుంటే ఈ సినిమా ఫస్ట్ కాపీ రీసెంట్ గా ఓవర్ సీస్ లో ప్రివ్యూ షోలుగా వేస్తున్నారు. దీన్ని కొందరు అభిమానులు, కొందరు మీడియా మిత్రులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ షోలను వీక్షించారు. విదేశాల్లోని ప్రేక్షకులు ప్రివ్యూలు చూసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమా బోయపాటి శ్రీనివాస్ గత సినిమాల కంటే అద్భుతంగా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా ఉన్నాయని, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని టాక్. 20 నిమిషాల బ్లీడింగ్ నార్మల్ రేంజ్ లో లేదని టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు లాస్ట్ 20 మినిట్స్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఆ చివరి 20 నిమిషాలు అభిమానులకు ఆనందాన్ని పంచడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా ఉందని ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆడియన్స్ కు గూస్ బాంబ్స్ తెప్పిస్తుందట.. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఫ్యామిలీ సీన్స్ పేలవంగా వచ్చాయని అంటున్నారు. దున్నపోతు ఫైట్ నెక్ట్స్ లెవల్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ మెప్పించిందని.. సెకండ్ ఆఫ్ లో కొంచెం బోర్ కొట్టిందని కొందరు అంటున్నారు.కొంత రోటీన్ గా సాగిన సినిమా మాస్ కు పూనకాలు ఖాయమని అంటున్నారు.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.