Uttar Pradesh: వైద్యో నారాయణో హరి అంటారు. దేవుడి తర్వాత వైద్యుడినే దేవుడిగా భావిస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టడం, పోయే ప్రాణాలను కాపాడడమే వైద్యుడి విధి. కానీ ఇక్కడో వైద్యుడు తన చిన్నపాటి నిర్లక్ష్యంతో ఇద్దరు నవజాత శిశువుల ప్రాణం తీశాడు. ఈ విషాధ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
ఫొటో థెరపీ కోసం క్లినిక్‌కు..
ఉత్తరప్రదేశ్‌లోని శామలి జిల్లా కౌలాణా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు పుట్టారు. వారిని ఫొటో థెరపీ కోసం సమీపంలోని ఓ ప్రైవేటు క్లినిక్ తరలించారు. అక్కడ ఫొటో థెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఉదయం చికిత్స అందించారు.
హాయిగా నిద్రపోదామని..
రాత్రి డ్యూటీకి వచ్చిన క్లినిక్ డాక్టర్.. హాయిగా నిద్రపోదామని ఫొటో థెరపీ యూనిట్‌లోకి వెళ్లి ఏసీ వేసుకున్నాడు. చల్లదనం కోసం ఏసీ కూలింగ్ పెంచాడు. అక్కడ ఇద్దరు నవజాత శిశువులు ఉన్నారని తెలిసి కూడా కూలింగ్ పెచండంతోపాటు హాయిగా నిద్రపోయాడు. రాత్రంతా ఏసీ నడుస్తూనే ఉంది. చలి తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువులు మృతిచెందారు.
ఉదయం విగత జీవులుగా..
ఆదివారం ఉదయం చిన్నారులను చూసేందురు కుటుంబ సభ్యులు క్లినిక్‌కు చేరుకున్నారు. పిల్లలిద్దరూ ఫొటో థెరపీ యూనిట్‌లో విగత జీవులుగా కనిపించారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టరైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసలు వచ్చి చిన్నారుల మృతికి కారణమైన డాక్టర్‌ను అరెస్ట్ చేశారు.