Bigg Boss 7 Telugu : రతికా రోజ్ పొట్టిబట్టల్లో రెచ్చగొడుతుందన్న పల్లవి ప్రశాంత్… ఆపై అడ్డంగా బుక్!

ఇది పల్లవి ప్రశాంత్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీకి దారితీయవచ్చు. చదువు, లోక జ్ఞానం, లౌక్యం తెలియని పల్లవి ప్రశాంత్ ని రతికా రోజ్ బాగా ట్రాప్ చేస్తుంది.

Written By: NARESH, Updated On : September 26, 2023 10:19 pm

Bigg boss 7 Telugu1

Follow us on

Bigg Boss 7 Telugu : రతికా రోజ్ మరోసారి పల్లవి ప్రశాంత్ మీద ఫైర్ అయ్యింది. తన డ్రెస్సింగ్ మీద కామెంట్ చేశాడంటూ అతన్ని ఏకిపారేసింది. మేటర్లోకి వెళితే… హౌస్లో నామినేషన్స్ జరుగుతుండగా గౌతమ్ కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. శోభా శెట్టి ఎదుట షర్ట్ విప్పడం నచ్చలేదని అందుకే నామినేట్ చేశాను అన్నాడు. మీరిద్దరూ అరుచుకున్నారు. అంత వరకూ పర్లేదు. అమ్మాయి ముందు చొక్కా తీసేసి బాడీ చూపించడం సరికాదు. అందుకే నామినేట్ చేశాను అన్నాడు.

పల్లవి ప్రశాంత్ పాయింట్ ని గౌతమ్ కృష్ణ ఒప్పుకోలేదు. నా బాడీ నా ఇష్టం. చొక్కా లేకుండా తిరుగుతా అన్నాడు. రతికా రోజ్ వన్ పీస్ వేసుకున్నప్పుడు… మరీ అంత పొట్టిబట్టలు ఎందుకు వేసుకుంటున్నావని నువ్వు అన్నావు. ఆమె డ్రెస్సింగ్ మీద నువ్వెందుకు కామెంట్ చేశావని గౌతమ్ కృష్ణ పల్లవి ప్రశాంత్ కి కౌంటర్ వేశాడు. దీంతో సీన్లోకి రతికా వచ్చింది.

నా డ్రెస్సింగ్ పై కామెంట్ చేయడానికి నువ్వు ఎవరు అన్నది. మరి నువ్వు కూడా చిన్న బట్టల్లో నా దగ్గరకు వచ్చి కవ్విస్తున్నావనే అర్థంలో పల్లవి ప్రశాంత్ అన్నాడు. నోటికి వచ్చింది మాట్లాడితే బాగోదు. అసలు నా ప్రాపర్టీ అని ఎలా అంటావ్ అని రతికా రోజ్ అన్నది. దోస్త్ కాబట్టి మజాక్ చేశానని పల్లవి ప్రశాంత్ అన్నాడు. అసలు నువ్వు ఎవడు నాతో మజాక్ చేయడానికి అంటూ రతికా రోజ్ బరస్ట్ అయ్యింది.

ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ బుక్ అయ్యాడనిపిస్తుంది. దెబ్బకు మనోడికి మైండ్ బ్లాక్ అయ్యింది. అలాగే అమ్మాయిల డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేశాడనే అపవాదుకు గురయ్యాడు. ఇది పల్లవి ప్రశాంత్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీకి దారితీయవచ్చు. చదువు, లోక జ్ఞానం, లౌక్యం తెలియని పల్లవి ప్రశాంత్ ని రతికా రోజ్ బాగా ట్రాప్ చేస్తుంది. నామినేషన్స్ లో ప్రత్యర్థుల పాయింట్స్ కి గట్టి కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు.