The Paradise New Poster: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise Movie). ఈ సినిమాలో ఆయన హీరో గా నటించడమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే గ్లింప్స్ వీడియో తో ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ ని పెంచాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో హీరో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తీయలేదు, అసలు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ద్వారా ఏమి చెప్పాలని అనుకుంటున్నాడు?, హీరో నాని క్యారక్టర్ ఫస్ట్ లుక్, మరియు ఆయన క్యారెక్టర్ పేరు ‘జడల్’ చాలా విచిత్రం గా ఉంది. ఇక ఆయన స్నేహితుడి పాత్రలో సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నాడు. ఆయన పేరు బిర్యానీ అట. ఇక ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు ఫస్ట్ లుక్ కూడా చాలా వెరైటీ గా ఉంది.
ఇలా ఒక సరికొత్త ప్రపంచాన్నే సృష్టించాడు ఆ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఆడియన్స్ కి ఈ సినిమా కాన్సెప్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అవగాహాన రాలేదు. కానీ ఎదో సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు , ప్రోత్సహిద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు ఆడియన్స్. నేడు న్యూ ఇయర్ సందర్భంగా ‘జడల్ జమానా’ అంటూ ఒక సరికొత్త పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని లుక్ విశేషంగా ఆకట్టుకుంది . కానీ విడుదల తేదీనే ఇండస్ట్రీ లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మార్చి 26 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అంటూ మూవీ టీం పదే పదే చెప్తోంది. మార్చి 27 న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది ‘ సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల్లో ఏది వెనక్కి వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.
మరో విషయం ఏమిటంటే, హీరో నాని ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమా మార్చి 26 న విడుదల చెయ్యాలి అనే పట్టుదల తో ఉన్నాడట. డైరెక్టర్ శ్రీకాంత్ తనకు మరింత సమయం కావాలని రిక్వెస్ట్ చేసినా కూడా నాని ఒప్పుకోవడం లేదట. ముందుగ ఏర్పాటు చేసుకున్న ప్లాన్ ప్రకారమే వెళ్లాలని చూస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య బడ్జెట్ విషయం లో కూడా అభిప్రాయం బేధాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు లోపు ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితిలోనూ పూర్తి చెయ్యాలని డెడ్ లైన్ పెట్టాడు నాని. ఒకవేళ ఆ డెడ్ లైన్ కి శ్రీకాంత్ ఓదెల చేరుకోలేకపోతే, ఆ తర్వాత ఏమి జరగబోతుంది అనేది ఆసక్తికరమైన విషయం.
Happy New year. ♥️
2026
Jadal Zamana #TheParadise pic.twitter.com/HRat19w0m6— Nani (@NameisNani) January 1, 2026