Hyundai: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒకప్పుడు కార్ల వాటా తక్కువగా ఉండేది. ఇప్పుడు ద్విచక్ర వాహనాలను బీట్ చేసే విధంగా కార్ల పరిశ్రమ ఎదిగింది. ఒకానొక సందర్భంలో ద్విచక్ర వాహనాలకు మించి కార్ల విక్రయాలు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.. ఇందులో కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ.. చాలామంది నేటి కాలంలో కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
మన దేశ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇందులో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (Hyundai motor India limited) కంపెనీ ముందు వరుసలో ఉంటుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ కంపెనీ కూడా కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. బడ్జెట్ నుంచి మొదలు పెడితే ప్రీమియం మోడల్స్ వరకు ఈ కంపెనీ ఎన్నో తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన కార్లను కొనుగోలు చేయకపోవడమే మంచిదని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కంపెనీ దేశవ్యాప్తంగా తన మోడల్స్ పై ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తుంది. జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వాహనాలు తయారీలో ఉపయోగించే కీలకమైన లోహాల ధరలు.. ఇతర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇన్పుట్ ఖర్చులు భారంగా మారుతున్నాయి. అందువల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నారు తెలుస్తోంది.. రెగ్యులేటరీ ఫైలింగ్ లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సగటున సుమారు 0.6% మేర ధరల పెంపు ఉందని ప్రకటించింది. ముడి సరుకుల మీద ధరల ఒత్తిడి అధికంగా ఉందని.. అందువల్లే వాటిని ఈక్వల్ చేయడానికి ఈ ధరల సవరణ చేపట్టినట్టు హ్యుందాయ్ వెల్లడించింది.
మోడల్ ప్రకారం ధరల పెంపును బయటకు చెప్పకపోయినప్పటికీ.. క్రెటా ఎస్ యు వి, వెన్ యు కంపాక్ట్ ఎస్ యు వి, ఎక్స్టర్ మైక్రో ఎస్ యు వి, గ్రాండ్ ఐ 10 హచ్ బ్యాక్, అల్కాజార్ వంటి మోడల్స్ కొనుగోలుపై ఈ ధరల ప్రభావం కనిపిస్తుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. హ్యుందాయ్ మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రకాల కంపెనీలు కూడా ఇలాంటి ధరలను నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీలో సుప్రసిద్ధమైన రెనాల్ట్ గ్రూపుకు చెందిన రెనాల్ట్ ఇండియా కూడా తమ మోడల్స్ పై 2 శాతం వరకు ధరలు పెంచుతామని ప్రకటించింది. JSW MG motor India, Mercedes Benz ఇండియా వంటి కంపెనీలు కూడా రెండు శాతం వరకు ధరలు పెంచాయి.. Honda cars India, Nissan motor India, b y d కంపెనీలు కూడా ధరలను పెంచాయి.
ఆటోమొబైల్ వర్గాల ప్రకారం కొన్ని సంవత్సరాల నుంచి పోల్చి చూస్తే ఈసారి ధరల పెంపు భయపడే స్థాయిలో లేదని తెలుస్తోంది. వినియోగదారుల డిమాండ్ స్థిరంగా ఉందని.. పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని.. పెరిగిన ధరలు కొనుగోళ్ల మీద కొంతవరకు ప్రభావం చూపిస్తాయని.. వేచి చూసే ధోరణి ఉన్నవాళ్లు ఇప్పట్లో హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయకుండా ఉంటారని.. మిగతావారు మాత్రం ధరలను పట్టించుకోకుండా కొనుగోలు చేస్తారని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఇక హ్యుందాయ్ కంపెనీలో క్రెటా మోడల్ సెగ్మెంట్ లీడర్ గా కొనసాగుతోంది. ఎక్స్పెక్ట్ ఎంట్రీ లెవెల్ విభాగంలో ఇది దుమ్ము లేపుతోంది.