సాధారణంగా స్త్రీ జన్మ పరిపూర్ణం అయ్యేది తను తల్లిగా మారినప్పుడే. స్త్రీ జీవితంలో మాతృత్వం పొందడం దేవుడిచ్చిన వరమని చెప్పవచ్చు.ఇలాంటి మాతృత్వాన్ని పొందడానికి ఎంతోమంది స్త్రీలు ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరికి సంతానభాగ్యం కలగదు. ఆ విధంగా సంతానం లేని మహిళలు బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఈ విధంగా సంతానం పొందడానికి ఎంతోమంది ఎన్నో దేవాలయాలను దర్శిస్తుంటారు. ఈ విధంగా సంతానం విషయానికి వస్తే ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పవచ్చు.సంతానం కోసం ఎదురు చూసే మహిళలు ఈ ఆలయంలో నేలపై పడుకోవడం వల్ల వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: పగడాల దండలు.. ఉంగరాలు వారంలో ఆ రోజు ధరిస్తే ఏం జరుగుతుంది?
హిమాచల్ ప్రదేశ్ లోని మాది జిల్లా, లాధ్ బరోల్ అనే ప్రాంతంలో సిమాస్ అనే గ్రామంలో ఒక ఆలయం ఉంది.ఈ ఆలయంలో సంతాన్ దాత్రి అనే అమ్మవారు కొలువై ఉంటారు.సంతానం కావాలనుకునే మహిళలు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి ఒకరోజు రాత్రి నేలపై పడుకుంటే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది.
Also Read: ఆ గ్రామంలో పాము కరిచినా చనిపోరట.. ఎక్కడంటే..?
ఈ ఆలయంలో పడుకునే మహిళలకు రాత్రి కలలో అమ్మవారు కనిపించి ఒక పువ్వును ఇచ్చినట్లు కల వస్తే వారికి సంతానం కలుగుతుందని చెబుతారు. అదేవిధంగా కలలో అమ్మవారు జామ పండు ఇచ్చినట్లు కనిపిస్తే వారికి మగ సంతానం కలుగుతుందని, బెండకాయ ఇచ్చినట్లు కనిపిస్తే వారికి ఆడ సంతానం కలుగుతుందని భావిస్తారు.ఇవి కాకుండా కలలో రాళ్ళు, లోహాలు, ఇతర వస్తువులు కనిపిస్తే అటువంటి వారికి ఈ జన్మలో సంతానం కలగదని అటువంటి వారు అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని సూచిస్తారు.ఈ విధంగా సంతానం కోసం ఎదురు చూసే వారు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని దసరా ఉత్సవాలలో భాగంగా నవరాత్రి చివరి రోజు ఎక్కువ సంఖ్యలో చేరుకుని అమ్మవారిని పూజిస్తారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం