నట వారసుడితో ‘సోషల్ మీడియా బ్యూటీ’ !

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’, స్టార్ వారసుల్లో అందరీ కంటే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకోగలిగాడు. స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ తనకు ఉంది అని ‘ధృవ్’ మొదటి సినిమాతోనే నిరూపించుకోగలిగాడు. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నట వారసుడు, తన తండ్రిలాగే మంచి నటుడు. పైగా క్యారెక్టర్ కోసం బాడీని ఎలాగైనా మార్చుకోగలిగిన నేర్పు కూడా తండ్రి […]

Written By: admin, Updated On : January 28, 2021 12:36 pm
Follow us on


తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’, స్టార్ వారసుల్లో అందరీ కంటే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకోగలిగాడు. స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ తనకు ఉంది అని ‘ధృవ్’ మొదటి సినిమాతోనే నిరూపించుకోగలిగాడు. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నట వారసుడు, తన తండ్రిలాగే మంచి నటుడు. పైగా క్యారెక్టర్ కోసం బాడీని ఎలాగైనా మార్చుకోగలిగిన నేర్పు కూడా తండ్రి నుండి పుణికిపుచ్చుకున్నట్టు ఉన్నాడు. మొదటి సినిమాతోనే వేరియేషన్స్ చూపిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా బాగా పేరు తెచ్చుకున్నాడు.

Also Read: ‘బిగ్ బాస్ 5’కి డేట్ ఫిక్స్.. హోస్ట్ గా కొత్త స్టార్ !

ఇక తన తరువాత సినిమాల కోసం ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో, మార్చి నుండి కొత్త సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ధృవ్ ప్రస్తుతం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం తన ఫామ్ హౌస్ లో ఏకాంతంగా గత కొన్ని రోజులు నుండి తన ట్రైనర్ సాయంతో కఠినతరమైన కసరత్తులు చేస్తుకుంటూ తనని తాను కొత్తగా మార్చుకుంటున్నాడట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ను తీసుకుంటున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి.

Also Read: సింగరేణిలో ప్రభాస్ యాక్షన్ !

సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ‘ప్రియా ప్రకాష్ వారియర్’కి, ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు అనే చెప్పాలి. అందుకే, మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వండి అంటూ అందర్నీ పోన్ చేసి మరి అడిగి, అవకాశాలను సాధిస్తోంది. ఈ క్రమంలో విక్రమ్ కుమారుడికి కూడా ఫోన్ వెళ్లడం.. కుర్రాడు అమ్మాయి అడిగేసరికి కాదనలేకపోవడం.. మొత్తానికి సోషల్ మీడియా బ్యూటీకి ఛాన్స్ వచ్చేసింది. నిజానికి ప్రియాకి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చినా, ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి.. వచ్చిన ఆఫర్లను దూరం చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్