https://oktelugu.com/

పీఆర్సీ పై కేసీఆర్ స్కెచ్ ఇదేనా..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రకటిస్తున్న తొలి పీఆర్సీ పై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలో 63శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే అర్జీ పెట్టుకున్నారు. అయితే మూడేళ్ల క్రితం వేసిన బిశ్వాల్ కమిటీ అటూ.. ఇటూ… ఆలోచించి సిఫారసు చేసింది ఏడున్నర శాతం. అసలు రెండింటికీ పోలికనే లేదు. ఇప్పటి వరకు ప్రకటించన 11 పీఆర్సీలల్లో ఇంత అధ్వానమైన ప్రదిపాదన ఇదేనని ఉద్యోగ సంఘాల నాయకులు మండి పడుతున్నారు. సీఎం […]

Written By: , Updated On : January 28, 2021 / 10:31 AM IST
Follow us on

KCR
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రకటిస్తున్న తొలి పీఆర్సీ పై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలో 63శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే అర్జీ పెట్టుకున్నారు. అయితే మూడేళ్ల క్రితం వేసిన బిశ్వాల్ కమిటీ అటూ.. ఇటూ… ఆలోచించి సిఫారసు చేసింది ఏడున్నర శాతం. అసలు రెండింటికీ పోలికనే లేదు. ఇప్పటి వరకు ప్రకటించన 11 పీఆర్సీలల్లో ఇంత అధ్వానమైన ప్రదిపాదన ఇదేనని ఉద్యోగ సంఘాల నాయకులు మండి పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయమై పునర్ ఆలోచించాలని కోరుతున్నారు.

Also Read: నిమ్మగడ్డ బదిలీ చేసిన అధికారులకు జగన్ అందలం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నూతన పీఆర్సీ కోసం మూడేళ్లుగా కోరుతున్నారు. ఉమ్మడి సర్కారులో ప్రతిపాదించిన పీఆర్సీని తెలంగాణ సర్కారు ఏర్పడిన తరువాత 2014లో అమలు చేశారు. అప్పడు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. అయితే ఈ సారి 63శాతం ఆశిస్తున్నామని గతంలోనే చాలా సార్లు ప్రకటనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత దూరమైన వర్గాలను కేసీఆర్ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో తమకు తమకు పీఆర్సీ భారీగా ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశిస్తూ వస్తున్నారు.

బిశ్వాల్ కమిటీ రిపోర్టు బుధవారం బయటకు వచ్చింది. అందులో కేవలం ఏడున్నర శాతం ఫిట్మెంట్.. ఇంటి అద్దె తగ్గించాలని సిఫారసు చేయడంతో ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగ ఆందోళనకు గురయ్యారు. పీఆర్సీ నివేదికపై చర్చేంచేందుకు సర్కారు నియమించిన త్రిసభ్య కమిటీ కూడా వివిధ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలకు వివరించిన సీఎస్… పీఆర్సీ ఫిట్ మెంట్ విషయంలో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల అభిప్రాయాన్ని సీఎం వద్దకు తీసుకెళుతానని వివరించారు.

Also Read: రంగంలోకి సీఎం జగన్.. ఆ ఇద్దరు అధికారులకు క్లీన్ చిట్..?

పీఆర్సీ గురించి సీఎం వద్దనే తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పటికే తెల్చి చెప్పింది. అది పీఆర్సీ నివేదిక కాదు.. పిసినారి నివేదిక అని త్వరలో సీఎంను కలిసి తేల్చుకుంటామని ప్రకటించారు. మరీ ఏడున్నర ఫిట్ మెంట్ ఏంటని ఉద్యోగ సంఘాల నాయకులు అంటుండగా.. కేసీఆర్ వ్యూహాలు ఇలాగే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఏ విషయంలో నైనా మొదట పూర్తి స్థాయిలో నిరాదారణ చూపుతారు. చివరికి ఆశలు వదులుకున్నాక.. ఊహించని బంపర్ ఆఫర్ ఇస్తారు. దాంతో వారు పాలు.. పూలాభిషేకాలు చేస్తారు. అందుకే ఇంత తక్కువ పీఆర్సీ సిఫారసు చేసినా.. ఎక్కువ ఇస్తున్నాం.. అని చెప్పడానికి ప్రభుత్వం ఇలాంటి వ్యూహం అమలు చేస్తోందని కనీసం 40శాతమైనా ఇస్తారని ఉద్యోగ సంఘాలు ఆశలు పెట్టకున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్