Unknown Facts About Mahesh Babu Mother: తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పతికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంట్లో ఇందిర తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగింది. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కృష్ణ – విజయ నిర్మల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఇందిరాదేవి గురించి చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.

హీరో కృష్ణతో ఇందిరాదేవి వివాహం
నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ డిగ్రీ పూర్తైన వెంటనే మద్రాసు వెళ్లారు. అక్కడ అవకాశాల కోసం వేచి చూస్తోన్న సమయంలోనే.. అంటే 1965లో ‘తేనే మనసులు’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఇక, ఆ సంవత్సరమే నవంబర్‌లో కృష్ణ.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
Also Read: Mahesh Babu Emotional: అమ్మ కాఫీ నాకు ప్రసాదంతో సమానం… కన్నీరు పెట్టిస్తున్న మహేష్ మాటలు!
విజయ నిర్మలతో రెండో పెళ్లి
సూపర్ స్టార్ కృష్ణతో ఇందిరా దేవికి వివాహం జరిగిన తర్వాత వీళ్ల వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే ఈ జంటకు రమేశ్‌బాబు, పద్మావతి జన్మించారు. ఆ సమయంలోనే కృష్ణ, తోటి నటి విజయనిర్మలతో సహజీవనం చేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ప్రచారాన్ని నిజం చేస్తూ 1969లో ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది.
రెండో పెళ్లి చేసుకున్నా.. కృష్ణతోనే ఇందిరాదేవి..
1969లో విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఈ విషయాన్ని నేరుగా తన భార్య ఇందిరాదేవికి చెప్పారట. మొదట్లో దీనిపై చాలా బాధపడిన ఆమె.. ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తేల్చి చెప్పేశారని తెలిసింది. ఇక, రెండో పెళ్లి అయినా భర్తతోనే కలిసి ఉంటానని సూటిగా చెప్పారట. దీంతో కృష్ణ ఇద్దరు భార్యలతోనూ కలిసి ఉండేవారట.

ఇందిరాదేవితోనే కలిసి ఉన్న కృష్ణ..
సూపర్ స్టార్ కృష్ణ.. విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇందిరా దేవితో ఎక్కువగా కలిసి ఉండేవారు. ఈ క్రమంలోనే ఈ జంటకు మంజుల, మహేశ్‌బాబు, ప్రియదర్శిని జన్మించారు. దీంతో ఇందిరా తన పిల్లలతోనే కలిసి ఉండేవారు. ఈ క్రమంలో కృష్ణ మాత్రం విజయ నిర్మలకు దగ్గరయ్యారు. ఆమెతోనే ఎక్కువగా ఉండేవారని టాక్ ఉంది. ఆ తర్వాత ఆమెతోనే కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు.
మొన్నటి పుట్టినరోజున జంటగానే
విజయ నిర్మలతోనే కలిసి ఉన్న సూపర్ స్టార్ కృష్ణ.. తన మొదటి భార్య ఇందిరా దేవిని కూడా అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవారు. మరీ ముఖ్యంగా ఆమె పుట్టినరోజు (ఏప్రిల్ 20)న మాత్రం కచ్చితంగా హాజరై కేక్ కట్ చేయించేవారు. ఇలా 2022న కూడా వీళ్లిద్దరూ జంటగానే కనిపించారు. ఇక, ఇప్పుడు ఇందిరా మరణంతో కృష్ణ విషాదంలో మునిగిపోయారు.
Also Read: Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు మనవాడే.. అతనికి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి !
[…] Also Read: Unknown Facts About Mahesh Babu Mother: మహేశ్ తల్లి గురించి స… […]
[…] Also Read: Unknown Facts About Mahesh Babu Mother: మహేశ్ తల్లి గురించి స… […]
[…] Also Read: Unknown Facts About Mahesh Babu Mother: Sensational facts about Mahesh Babu’s mother.. Do you … […]