Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు మనవాడే.. అతనికి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి !
Anushka Shetty Marriage: స్వీటీ అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా, ఇప్పటికీ అనుష్కకి ఫుల్ క్రేజ్ ఉంది. పైగా హీరోయిన్ గా కూడా మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తోంది. అయితే, అనుష్క మనసు పెళ్లిపై మళ్లిందనేది తాజాగా ఓ పుకారు వైరల్ అవుతుంది. ఇటీవల అనుష్క గోవాలో ఉన్న తన యోగా గురువు వద్దకు వెళ్లిందట. ఆ యోగా గురువు వద్ద అనుష్క […]

Anushka Shetty Marriage: స్వీటీ అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా, ఇప్పటికీ అనుష్కకి ఫుల్ క్రేజ్ ఉంది. పైగా హీరోయిన్ గా కూడా మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తోంది. అయితే, అనుష్క మనసు పెళ్లిపై మళ్లిందనేది తాజాగా ఓ పుకారు వైరల్ అవుతుంది. ఇటీవల అనుష్క గోవాలో ఉన్న తన యోగా గురువు వద్దకు వెళ్లిందట.

Anushka Shetty
ఆ యోగా గురువు వద్ద అనుష్క కొన్ని రోజుల పాటు యోగాకు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకుని తిరిగి వచ్చిందట. అయితే, ఈ జర్నీ లో ఆమెకు తెలంగాణకు చెందిన ఓ బిజినెస్ మెన్ తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అని, త్వరలోనే ఆ గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడేందుకు అనుష్క సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది చూడాలి.
నిజానికి గత మూడేళ్ళ నుంచే అనుష్క పెళ్లి అంటూ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఎందుకో అనుష్క తగ్గ సంబంధం దొరకడం లేదు. ప్రభాస్ తో అనుష్క లవ్ అంటూ టాక్ నడిచినా అందులో నిజం లేదని అనుష్క ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చింది. ఓ దశలో అసలు అనుష్కకు ఎందుకు పెళ్లి సెట్ అవ్వడం లేదు అంటూ ఆమె ఫ్యామిలీ తెగ ఫీల్ అయిపోతుందని కూడా వార్తలు వచ్చాయి.

Anushka Shetty
ప్రస్తుతం సినిమా షూట్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన ఫ్యామిలీ కోసం తన పెళ్లి గురించి ప్రస్తుతం సీరియస్ గా ఆలోచిస్తోంది. లైఫ్ లో సెటిల్ అవ్వడం ఎంత ముఖ్యమో.. పెళ్లి కూడా అంతే ముఖ్యం అని మొత్తానికి అనుష్క పెళ్ళికి రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే అనుష్క తెలంగాణకి చెందిన బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుందట. ఆ బిజినెస్ మెన్ కి హైదరాబాద్ లో రెస్టారెంట్లు ఉన్నాయట. అన్ని సెట్ అయితే, త్వరలోనే అనుష్కకి ఆ రెస్టారెంట్స్ కి ఓనర్ అవ్వనుంది.
ఏది ఏమైనా అనుష్క పెళ్లి పై గత పదేళ్లు నుంచి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అన్నట్టు పెళ్లి తర్వాత కూడా అనుష్క సినిమాలు చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఎలాగూ శ్రీయా, స్నేహ, ప్రియమణి, సమంత లాంటి హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. పైగా కొత్తగా ఈ లిస్ట్ లోకి కాజల్ కూడా చేరింది. అందుకే.. అనుష్క కూడా ఇదే ప్లాన్ ను ఫాలో అవ్వబోతుంది.
Also Read: Hero Nandu: గీతామాధురి భర్తకు ఏమైంది..? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నందు, షాక్ లో ఫ్యాన్స్!
