Indira Gandhi- Bathukamma: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు సాగే పండుగలో ప్రతి రోజు ఆడవారు బతుకమ్మను పేర్చి ఆటలు ఆడుతుంటారు. తెలంగాణలో అతి పెద్ద పండుగగా పేర్కొనే బతుకమ్మపండుగను వైభవంగా జరుపుకుంటారు. ప్రపంచంలోనే ప్రకృతిలో దొరికే పూలను పూజించే పండుగగా బతుకమ్మకు విశిష్టత ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. దీంతో బతుకమ్మ సంబరాలు రాష్ట్రంలో అంబరాన్నంటుతాయి. ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం అందరిని ఆకట్టుకుంటుంది. ఈనేపథ్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు కొనసాగుతున్నాయి.

బతుకమ్మ పండుగకు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలపడం మామూలే. రాష్ట్రంలో జరిగే పండుగ గురించి చాలా మంది నేతలు తమ ప్రజల కోసం అభినందనలు తెలుపుతారు. ఈ క్రమంలో మన దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ సైతం బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఓ ఫొటోను మనం చూడటం విశేషం. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో 1978లో వరంగల్ లో జరిగిన బతుకమ్మ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించిన ఫొటోను ఆమె మనవరాలు ప్రియాంక గాంధీ షేర్ చేయడంతో అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడో జరిగిన కార్యక్రమం అయినా తన నానమ్మ ఫొటోను నెట్టింట్లో పెట్టడంతో వైరల్ గా మారింది. ఎంతో అపురూపమైన ఫొటోను ఇలా సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరాగాంధీ బతుకమ్మను తన చేతుల్తో పట్టుకుని పాల్గొనడం అప్పట్లో సంచలనం కలిగించింది. దీంతో ఆ ఫొటోను ప్రియాంక గాంధీ షేర్ చేయడంతో ఫొటో వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే తీరు అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. పూల పండుగను ఇంత బాగా జరుపుకునే తెలంగాణ సంప్రదాయానికి ఫిదా అయిపోయారు. మన ఆచార వ్యవహారాలకు ముగ్దులయ్యారు. బతుకమ్మ పండుగ విశిష్టతపై సంబరపడ్డారు. మహిళల గొప్పతనాన్ని పొగిడారు.

ఇందిరాగాంధీ 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంపై ఉన్న మమకారంతో ఆమె వరంగల్ లో జరిగే బతుకమ్మ వేడుకలను స్వయంగా వీక్షించి తన అనుభవాలు పంచుకున్నారు. బతుకమ్మ ఉత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించే మహిళల ప్రత్యేకతను వేనోళ్ల పొగిడారు. ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపి అబ్బురపరచారు. ఇందిరాగాంధీ లాంటి మహోన్నత వ్యక్తి ప్రశంసలు అందుకున్న బతుకమ్మ పండుగకు ఉన్న ప్రాధాన్యం మనకు తెలిసిందే.
Also Read: YCP- Chiranjeevi and Pawan Kalyan: పవన్ దూకుడుకు చిరంజీవితో చెక్…వైసీపీ మైండ్ గేమ్
[…] […]