Pawan Kalyan Ustaad Bhagat Singh Guest Appearance: సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వారి నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. అందువల్లే వాళ్ల సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో తన సత్తా చాటుతున్నాడు. జనసేన పార్టీ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 2024వ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్ లో 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లను గెలిచారు… 100% సక్సెస్ రేటు కలిగిన నాయకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు..ఇక ఈ క్రమంలోనే టిడిపి,బిజెపితో పార్టీలతో కలిసి ఆయన గవర్నమెంట్ ఫామ్ అవడానికి హెల్ప్ చేశాడు. ఇక అందులో భాగంగానే తను డిప్యూటీ సీఎం గా మారాడు. ఇక ఈ క్రమంలో ఆయన చేస్తున్న ప్రతి పని కూడా జనానికి మేలు కలిగించే విధంగా ఉంటుంది.
రాజకీయ రంగంలో రాణిస్తూనే సినిమా రంగాన్ని సైతం తను వదిలిపెట్టడం లేదు. తన అభిమానులను ఆనంద పరచడానికి వరుస సినిమాలైతే చేస్తున్నాడు. గత సంవత్సరం ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మార్చి 19వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో ఒక స్టార్ హీరో సైతం గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే రామ్ చరణ్ గా తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక క్యామియో రోల్ పోషిస్తున్నాడట.
అది ఇప్పటివరకు ఎవరికి ఎక్కడా చెప్పలేదు తన షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయింది అంట… అందువల్లే ఈ సినిమా మీద హైప్ తీసుకురావడం కంటే కూడా థియేటర్లో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆ న్యూస్ ని హైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…