దేశంలో 40 కోట్లకు పైగా కస్టమర్లతో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక సూచనలు చేస్తోంది. సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ ఖాతాదారులను మరోమారు హెచ్చరించింది. కొందరు ఖాతాదారులు మోసపూరిత మెసేజ్ ల వల్ల డబ్బును పోగొట్టుకుంటున్నారని.. ఆలాంటి మోసాల బారిన పడి నష్టపోవద్దని కస్టమర్లకు తెలిపింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ లను నమ్మవద్దని.. చాలామంది ఫేక్ మెసేజ్ ల వల్ల డబ్బులను పోగొట్టుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. మోసగాళ్ల బారిన పడితే కొన్నిసార్లు ఖాతాలలో డబ్బులు మాయం అయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఖాతాదారులకు ఏ విధమైన సందేహాలు ఉన్నా బ్యాంకు శాఖను సంప్రదించి తెలుసుకోవాలని సూచించింది.
రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఎప్పటికప్పుడు ఖాతాదారులను అలర్ట్ చేస్తూ కీలక సూచనలు చేస్తోంది. బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని చెబుతోంది. టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
చాలామంది ఖాతాదారులు సైబర్ మోసాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మోసపోతున్నారు. దీంతో ఎస్బీఐ కస్టమర్లను అలర్ట్ చేయడం ద్వారా వాళ్లను మోసాల బారిన పడకుండా అప్రమత్తం చేస్తోంది. దేశంలో రోజూ పదుల సంఖ్యలో సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది.
SBI customers are requested to be alert on Social Media and not fall for any misleading and fake messages.#SBI #StateBankOfIndia #CyberSecurity pic.twitter.com/XQpChKLt67
— State Bank of India (@TheOfficialSBI) November 9, 2020