దుబ్బాక ఫలితాలు టీఆర్‌ఎస్ నేతలను ఆలోచనలో పడేశాయి. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయంటూ ఇన్ని రోజులు ధీమాతో ఉన్న వారి మొఖాలు ఒక్కసారిగా తెల్లబడిపోయాయి. దుబ్బాక దంగల్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు పూర్తైన ఓట్ల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించి సంచలనం సృష్టించింది.
Also Read: దుబ్బాకలో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ
మరోవైపు ట్రబుల్ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరు గాంచిన మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో సైతం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. హరీష్ రావు దత్తత గ్రామమైన చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి ఏకంగా మంత్రికే షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు 14 రౌండ్లలో లెక్కింపు పూర్తవ్వగా ఐదు రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యతను చూపింది. ఒక్క రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగగా.. మిగతి అన్ని రౌండ్లలోనూ బీజేపీ తన బలాన్ని చాటింది.
Also Read: దుబ్బాకలో బీజేపీ లీడ్.. ఏం జరుగుతోంది
ఇప్పటివరకు 14 రౌండ్ల లెక్కింపు పూర్తిచేయగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థికి 38,076 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 41,514 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 12,658 ఓట్లు పడ్డాయి. మొత్తంగా చూస్తే 14 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి 3,438 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
మరోవైపు 13, 14 రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యతను ప్రదర్శించారు. దీంతో మిగిలిన రౌండ్లపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉండగా.. 61,442 ఓట్లు లెక్కించాల్సి ఉంది. మరి రౌండ్లలో ఏ పార్టీల అభ్యర్థులు తమ ఆధిక్యతను ప్రదర్శిస్తారనే దాని మీదనే ఆసక్తి నెలకొని ఉంది.