దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్బీఐ ఖాతాదారులు సులభంగా లోన్ పొందే అవకాశం కల్పించింది. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా అర్హత ఉన్న కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ నుంచి సులభంగా లోన్ లభించనుంది. మిస్డ్ కాల్ తో పాటు మెసేజ్ ద్వారా కూడా లోన్ పొందే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం ద్వారా కోట్ల సంఖ్యలో ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది.
Also Read: గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నారా.. సబ్సిడీ ఎలా తెలుసుకోవాలంటే..?
న్యూ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ఫెసిలిటీ పేరుతో ఎస్బీఐ కస్టమర్లు వేగంగా లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. త్వరితగతిన పెళ్లి, వెకేషన్, ఎమర్జెన్సీ, ఇతర ఉత్పత్తుల కొనుగోలు కోసం ఎస్బీఐ కస్టమర్లు లోన్ పొందవచ్చు. బ్యాంక్ నుంచి లోన్ పొందాలని భావించే వాళ్లు 7208933142 అనే నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సులభంగా లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. కస్టమర్ రుణ అర్హత ప్రాతిపదిక ఆధారంగా రుణం మంజూరవుతుంది.
Also Read: ఏడాదిపాటు మ్యాగి తిని బతికిన అతడే.. నేడు స్టార్ క్రికెటర్
ఎస్బీఐ ఖాతాదారులు ఈ రుణం తీసుకోవాలంటే 9.6 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మెసేజ్ ద్వారా లోన్ పొందాలని భావించే వాళ్లు personal అని టైప్ చేసి 7208933145 అనే నంబర్ కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఈ రుణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో రుణం తీసుకోవాలని భావించే వాళ్లకు ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఎస్బీఐ కొత్త సర్వీసుల ద్వారా సులభంగానే కస్టమర్లకు రుణాలు అందనున్నాయి. అయితే వడ్డీరేటు ఎక్కువ కావడంతో అత్యవసరమైతే మాత్రమే ఈ రుణం తీసుకుంటే మంచిది. ఎస్బీఐ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా తీసుకుంటున్న నిర్ణయాలపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.