కేసీఆర్ పుట్టినరోజుకు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్

ఫిబ్రవరి 17.. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఇప్పుడిది తెలంగాణ ప్రజలకు ఓ పండుగ రోజులా మార్చేస్తోంది గులాబీ దండు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కేసీఆర్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన ‘కోటి వృక్షార్చన’ అనే పిలుపు మేరకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన ట్విట్టర్ లో వీడియోను […]

Written By: NARESH, Updated On : February 18, 2021 12:04 pm
Follow us on

ఫిబ్రవరి 17.. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఇప్పుడిది తెలంగాణ ప్రజలకు ఓ పండుగ రోజులా మార్చేస్తోంది గులాబీ దండు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కేసీఆర్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన ‘కోటి వృక్షార్చన’ అనే పిలుపు మేరకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసి మరీ ఇదే కేటీఆర్ పుట్టినరోజుకు తన నుంచి గిఫ్ట్ అంటూ స్పందించారు.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు కోటివృక్షార్చన కార్యక్రమం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా అందరూ ఒకేసారి కోటి వృక్షాలు నాటుతున్నారు. గోదావరి జిల్లాలోని కడియం నర్సరీ కూడా కేసీఆర్ చిత్రపటాన్ని మొక్కలతో తీర్చిదిద్ది విషెస్ చెప్పింది.

ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ అందరూ ఇందులో భాగస్వాములై మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ‘కోటి వృక్షార్చన’లో పాల్గొని మొక్కలు నాటి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా అందిద్దాం అని చిరంజీవి పిలుపునిచ్చాడు.

తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి అని సీఎం కేసీఆర్ గారి ఆకాంక్ష. దాని కోసం రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని మొక్కలు నాటాలని.. కేసీఆర్ కు ఇదే కానుకగా ఇద్దాం అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ ఈ వృక్షార్చనలో పాల్గొని కేసీఆర్ బర్త్ డేను జరుపుతున్నారు.