
Renu Desai -Samantha : స్టార్ హీరోయిన్ కావడం ఒక యజ్ఞం. అయ్యాక ఆ ప్రయాణం కూడా నరకమే. గుర్తింపు వచ్చే వరకు పని ఉండదు. ఫేమ్ వచ్చాక తీరిక ఉండదు. కోట్ల సంపాదన ఉన్నా అనుభవించే, ఆస్వాదించే ప్రశాంత లభించదు. తారల జీవితాలు చాలా గజిబిజిగా ఉంటాయి. ఒక టైమ్ అంటూ లేని జాబ్ వాళ్ళది. అసమయ భోజనాలు, నిద్రలేని రాత్రులు, రోజుల తరబడి ప్రయాణాలు, భిన్నమైన వాతావరణ పరిస్థితులు… ఇలా అనేక సవాళ్లు ఎదుర్కోవాలి. ఈ పరిణామాలు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా… ఏదో రూపంలో కబళిస్తాయి.
దానికి తోడు మానసిక ఒత్తిడి ఎక్కువైతే అది ఇంకా నరకం. అరుదైన రోగాల బారిన పడిన హీరోయిన్స్ పదుల సంఖ్యలో ఉన్నారు. వీరిలో చికిత్సతో బయటపడింది కొందరైతే, కన్నుమూసిన వాళ్ళు మరికొందరు. అప్పటికీ హీరోయిన్స్ ఆహారం, ఆరోగ్యం విషయంలో నియమాలు పాటిస్తారు. అయినప్పటికీ ఆరోగ్య భద్రత లేదు. ముఖ్యంగా మానసిక వేదన అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. మానసిక ప్రశాంత ఉన్నప్పుడే అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం సహకరించదు. అనేక అనారోగ్యకర మార్పులు చోటు చేసుకుంటాయి. సమంత విషయానికి వస్తే.. ఆమెకు మయోసైటిస్ సోకడానికి ఒత్తిడే కారణం. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత వేదనకు గురయ్యారు. నెలల తరబడి ఆమె ఒత్తిడిలో బ్రతికారు. దాని నుండి బయటపడేందుకు మిత్రులతో గడిపారు. వరుసగా టూర్స్ కి వెళ్లారు. ఎంత ప్రయత్నం చేసినా డిప్రెషన్ నుండి బయటకు రాలేకపోతున్నారు. ఈ కండిషన్ ఆమెను మయోసైటిస్ బారిన పడేలా చేసింది. కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు. సమంత పూర్తిగా ఆ వ్యాధి నుండి కోలుకోలేదు.
తాజాగా రేణు దేశాయ్ తనకు హార్ట్ ప్రాబ్లమ్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చారు. చికిత్స తీసుకుంటున్నాను. వ్యాయామం, యోగా చేస్తూ మంచి ఆహారం తీసుకుంటున్నాను. ఈ సమస్య నుండి బయటపడి తిరిగి షూటింగ్ కి హాజరవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ ఆరోగ్య సమస్యలకు కూడా మానసిక ఒత్తిడే కావచ్చు. ఆమె ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు. మరోవైపు కెరీర్ నిర్మించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రేణు దేశాయ్ కి హెల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఇంత వరకు తెలియదు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది.