చదువు పూర్తైన తరువాత ఉద్యోగం విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయి. చాలామంది తక్కువ పని, ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అందరికీ అలాంటి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పలేం కానీ కష్టపడి వెతికితే అలాంటి ఉద్యోగం లభించే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. ఒక కంపెనీ బిస్కెట్లు తింటే ఏకంగా 40 లక్షల రూపాయలు వేతనం ఇస్తోంది.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ కంపెనీ నిజంగానే 40 లక్షల రూపాయలు జీతంగా చెల్లిస్తోంది. స్కాటిష్‌కు చెందిన బిస్కెట్ తయారీ కంపెనీ బార్డర్ బిస్కెట్స్ బిస్కెట్లు తిని ఆ బిస్కెట్ల రుచి చెబితే చాలు 40 లక్షలు వేతనం రూపంలో ఇస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కంపెనీ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి ఈ ఉద్యోగానికి సులభంగా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు చేసిన వారిలో ఉద్యోగానికి ఎంపికైన మాస్టర్ బిస్కెటర్ కు కంపెనీ ఏకంగా 40 లక్షల రూపాయలు వేతనం రూపంలో చెల్లించనుంది. ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి ప్రతిరోజూ కంపెనీ ఫ్రీగా ఇచ్చే బిస్కెట్లను రుచి చూసి పూర్తి రిపోర్ట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి కంపెనీ సంవత్సరానికి 40 లక్షల రూపాయల వేతనం చెల్లిస్తోంది. అయితే ఈ జాబ్ కు కొన్ని అర్హతలు ఉన్నవాళ్లను మాత్రమే ఎంపిక చేస్తారు.
నాయకత్వ లక్షణాలను కలిగి ఉండి ఇతరులతో పద్ధతిగా, బాగా మాట్లాడే నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఉద్యోగానికి దరఖాస్తు చేసేవాళ్లకు బిస్కెట్ల తయారీపై అవగాహన ఉండటంతో పాటు కస్టమర్లతో సమయస్పూర్తితో వ్యవహరించాలి. అయితే ఈ ఉద్యోగానికి ఆ దేశానికి చెందిన వాళ్లు మాత్రమే అర్హులు. అందువల్ల మన దేశానికి చెందిన వాళ్లు దరఖాస్తు చేసుకున్నా ఈ ఉద్యోగానికి ఎంపిక కారు.