Telugu News » Ap » Heavy rains in andhra pradesh today and tomorrow
Ad
ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు : వాతావరణశాఖ
తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారిణి స్టెల్లా తెలిపారు. దీంతో సోమవారం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.