ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు మణుగూరు ఏరియా కమిటీ కమెండర్ సుధీర్, మరొకరు గా గుర్తించారు. దీంతో ములుగు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. కాగా మంగపేటలోని ముసలమ్మ గుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఆదివారం వీరు మృతి చెందారు. సోమవారం ములుగు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించిన వారికి సంబంధించిన ఫొటోలను విడుదల చేయగా బంధువులు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.