Homeఎంటర్టైన్మెంట్RRR Movie First Full Review and Rating: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ ...

RRR Movie First Full Review and Rating: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

RRR Movie First Full Review and Rating: ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ భారతీయ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి సన్నద్ధం అయ్యింది. ఇప్పటివరకు ఉన్న భారీ రికార్డులన్నీ బద్ధలు కాబోతున్నాయి. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ఆల్ రెడీ చూసిన ఓవర్‌సీస్‌ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్‌ సంధు.. ఈ సినిమాకు రివ్యూ ఇస్తూ.. ఐదు స్టార్ల రేటింగ్‌ ఇచ్చాడు.

RRR First Review by UAE Critic Umair Sandhu || Jr NTR || Ram Charan || Oktelugu Entertainment

ఫిల్మ్ క్రిటిక్ గా ఉమైర్ సంధుకు మంచి నేమ్ ఉంది. గతంలో అతను ముందుగానే ‘దంగల్, బాహుబలి 2’, ‘రాధేశ్యామ్’ సినిమాల విషయంలో ఇలాగే రివ్యూ ఇచ్చాడు. అవి నిజం అయ్యాయి కూడా. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా నిజం అవుతుందని నమ్మకం ఉంది. ఇంతకీ ఉమైర్ సంధు ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూలో ఏమి చెప్పాడంటే..

విశ్లేషణ :

‘భారతీయ సినీ పరిశ్రమ పెద్ద కలలు కనడమే కాదు, వాటిని సాకారం కూడా చేసుకోవచ్చని నిరూపించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ అద్భుత చిత్రాన్ని ఎవరూ మిస్‌ కాకండి. ఇప్పటికీ ఇది బ్లాక్‌ బస్టర్‌ అయినా, రేపటి తరానికి ఇదొక క్లాసిక్‌.

నటి నటీనటుల విషయానికి వస్తే.. ఎన్టీఆర్‌ – చరణ్‌ అద్భుతంగా నటించారు. వారి కాంబినేషన్‌ అదిరింది. అజయ్‌ దేవ్‌గణ్‌ అయితే, ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజీ. ఎందుకో తెలియదు.. ఆలియా భట్‌ ఈ సినిమాలో మరింత అందంగా కనిపించింది.

ఇక ఈ సినిమాతో రాజమౌళి ఇండియాలోనే నెంబర్‌ 1 డైరెక్టర్‌ గా మారిపోయాడు అంటూ ఉమైర్‌ జక్కన్న పై ప్రశంసలు కురిపించాడు.

RRR Moive HighLights ‘ఆర్ఆర్ఆర్’లో మెయిన్ హైలైట్స్ ఇవే !

మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే… జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్. దర్శక ధీరుడు ఎన్టీఆర్ ను హైలైట్ చేయడానికి మొదటి నుంచి క్రేజీగా ప్లాన్ చేస్తూ వచ్చాడు. పైగా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. దీనికితోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ లు అద్భుతంగా ఉన్నాయి.

అందుకే, సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉన్నాయి. అన్నిటికి మించి ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపించాడు. పైగా ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు.

RRR First Full Review
RRR First Full Review

అదే విధంగా ‘ఎన్టీఆర్ – ఓలివియా’ లవ్ ట్రాక్ కూడా బాగా హైలైట్ ఉంది. వీరి మధ్య ఎక్కడా సింగిల్ డైలాగ్ కూడా ఉండడు. కేవలం వారి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా ఓలివియా, ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుంది. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ఆమె తన ప్రాణాలను సైతం అర్పిస్తోంది. ఓలివియా త్యాగంతో ముగిసే వీరి ట్రాక్ సినిమాలోనే హెవీ ఎమోషనల్ హైలైట్ గా నిలిచింది.

ఎన్టీఆర్ – చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశం కూడా గూస్ బంప్స్ వస్తాయి. అలాగే పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్ కూడా సినిమాలో మరో ప్రధాన హైలైట్ గా నిలిచింది.

RRR Movie Review and Rating

డైరెక్షన్ లో తనను బీట్ చేసే వారు లేరని.. రాజమౌళి మరోసారి ఘనంగా నిరూపించాడు. మొత్తమ్మీద ఈ చిత్రం ఎమోషనల్ డ్రామా.. భారీ యాక్షన్.. భారీ తారాగణం.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’ గా సాగుతూ అబ్బుర పరుస్తోంది. ఇక సాంకేతికంగా ఈ సినిమా మాస్టర్ పీస్‌. యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో అదిరిపోయాయి. తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు చూడలేదు. ఇక ఈ సినిమా ముగింపు ఊహించుకోవడం కూడా కష్టమే. అందుకే… డోంట్ మిస్ ఇట్.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

5 COMMENTS

  1. […] RRR Movie Actors Remuneration: ‘ఆర్ఆర్ఆర్’.. పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ మల్టీస్టారర్, ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా లాంటి తారాగణం నటించిన సినిమా ఇది. అజయ్ దేవగన్ హిందీలో స్టార్ హీరో. అలియా నంబర్ వన్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్. మరి, వీళ్లకు ఏ లెక్కన రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు ? సినిమాకి 400 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ఇక దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి రెమ్యునరేషన్ కూడా హీరోల కంటే ఎక్కువే ఉండి ఉంటుంది. […]

  2. […] Overnight Star Heros And Directors In Tollywood: సినిమా రంగంలో హీరోకు అయినా లేదంటే డైరెక్ట‌ర్‌కు అయినా స‌రే ఒక్క సినిమా లైఫ్ ఇస్తుంది. ఆ మూవీతోనే వారు ఇండ‌స్ట్రీలో స్టార్లుగా అవ‌త‌రిస్తారు. ఆ సినిమానే వారి మార్కెట్‌ను అమాంతం పెంచేస్తుంది. లెక్క లేన‌న్ని రికార్డుల‌ను వారి పేర్ల మీద న‌మోద‌య్యేలా చేస్తుంది. అలా హీరోల‌కు, డైరెక్ట‌ర్ల‌కు మార్కెట్‌ను అమాంతం పెంచేసిన సినిమాల‌పై ఓ లుక్కేద్దాం. […]

  3. […] Bollywood Media Spreading Negativity on RRR: బాలీవుడ్ లో మొదటి నుంచి మన తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. ఎక్కడి దాకో ఎందుకు తమిళంలోనే మన తెలుగు సినిమాలను మొన్నటి వరకు ఎంత చిన్నచూపు చూసేవారో మనకు తెలిసిందే. అయితే తమిళ సినిమాలు రొటీన్ కథలతో బోర్ కొట్టడంతో.. తెలుగు సినిమాలకు హైప్ పెరిగింది. ఒకప్పుడు బాలీవుడ్ లో మన తెలుగు సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ అయ్యేవి కావు. […]

  4. […] Ramcharan- Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అనతికాలంలోనే విపరీతమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తనదైన స్టైల్ లో దూసుకుపోతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి కూడా అందరికీ సుపరిచితమే. […]

  5. […] AP Assembly:  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నకిలీ మద్యం, పెగాసస్ వ్యవహారాలే వేదికగా అసెంబ్లీలో వివాదం ముదురుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో టీడీపీ సభ్యులు బుధవారం సభలో చిడతలు వాయిస్తూ నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిడతలు బయట కొట్టుకోవాలని సభలో కాదని హితవు పలికారు. సభా మర్యాదలకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల తీరుపై ఆక్షేపించారు. సభ్యులు సభలో హుందాగా ప్రవర్తించకుండా ఇలా చేయడమేమిటని స్పీకర్ ప్రశ్నిస్తున్నారు. […]

Comments are closed.

Exit mobile version