https://oktelugu.com/

Mansarovar Yatra: చైనా, నేపాల్ పోవాల్సిన అవసరం లేదు.. ఇక మనదేశం నుంచే మానస సరోవర్ యాత్ర..

Mansarovar Yatra: హిందువులు పవిత్రంగా భావించే ‘మానస సరోవర్’ యాత్ర ఇప్పుడు మరింత చేరువ కానుంది.. దేవుడిని దర్శించేందుకు తీర్థయాత్రలు చేయడం కూడా అలవాటే. ఇందులో భాగంగా దేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రాలను సందర్శించి మురిసిపోతుంటారు. ఈ నేపథ్యంలో కైలాస మానస సరోవర్ యాత్ర కోసం చాలా మంది భక్తులు విచ్చేస్తుంటారు. దేవుడిని దర్శించుకుని తమ కోరికలు తీర్చాలని వేడుకుంటారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరోవర్ యాత్ర కోసం పరుగులు పెడుతుంటారు. సాహసంతో కూడిన యాత్రే […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 23, 2022 / 01:31 PM IST
    Follow us on

    Mansarovar Yatra: హిందువులు పవిత్రంగా భావించే ‘మానస సరోవర్’ యాత్ర ఇప్పుడు మరింత చేరువ కానుంది.. దేవుడిని దర్శించేందుకు తీర్థయాత్రలు చేయడం కూడా అలవాటే. ఇందులో భాగంగా దేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రాలను సందర్శించి మురిసిపోతుంటారు. ఈ నేపథ్యంలో కైలాస మానస సరోవర్ యాత్ర కోసం చాలా మంది భక్తులు విచ్చేస్తుంటారు. దేవుడిని దర్శించుకుని తమ కోరికలు తీర్చాలని వేడుకుంటారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరోవర్ యాత్ర కోసం పరుగులు పెడుతుంటారు. సాహసంతో కూడిన యాత్రే అయినా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవాలని భావించడం తెలిసిందే.

    Mansarovar Yatra

    సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న సరోవర్ యాత్రకు చేరుకోవడానికి ఎన్నికష్టాలైనా పడుతుంటారు. అత్యంత ప్రమాకరమైన ప్రయాణమైనా అచంచల విశ్వాసంతో ముందుకు వెళ్తుంటారు. చైనా ఆధీనంలో ఉన్న హిమాలయాల్లో ఉన్న మానస సరోవర్ యాత్రకు వెళ్లడం మామూలే. టిబెట్ ప్రాంతంలో ఉండటంతో చలికాలం మంచుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలం, వానకాలంలోనే భక్తులు రావడానికి అనుమతి ఇస్తారు.

    Also Read: పెగాసస్ పై వైసీపీ దూకుడు, మమత ఆరోపణలతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ చేస్తారా?

    మహాశివుడి పవిత్ర స్థలంగా దీనికి పేరు. పూర్వ కాలంలో కైలాసగిరి ప్రాంతాన్ని భారత ఖండానికి చెందినదిగా చెప్పిన టిబెట్ స్వతంత్ర దేశం కావడంతో అది దాని పరిధిలోకి చేరింది. 1950లో చైనా దురాక్రమణతో టిబెట్ దాని ఆధీనంలోకి వెళ్లింది. కైలాస మానస సరోవర్ కు చేరడానికి మూడు మార్గాలు ఉంటాయి. అవి సిక్కిం, ఉత్తరాఖండ్, నేపాల్ మార్గాల ద్వారా వెళ్తుంటారు.

    Mansarovar Yatra

    ఇన్నాళ్లు మానస సరోవర్ యాత్ర చాలా కష్టనష్టాలకు ఓర్చి చేసేది. మన భారత్ నుంచి డైరెక్ట్ రూట్ లేకపోవడంతో చైనా, నేపాల్ మీదుగా కైలాస పర్వతానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కష్టాలు తీరాయి. చైనాతో దురాక్రమణ నేపథ్యంలో భారతీయులు ఆదేశం గుండా వెళ్లకుండానే భారత్ లోని ఉత్తరాఖండ్ నుంచే వెళ్లేలా కేంద్రంలోని మోడీ సర్కార్ రోడ్డు వేయించింది.

    ఇప్పుడు ఇండియా మరో కొత్త మార్గాన్ని కనుగొంది. ఉత్తరాఖండ్ లోని ధార్చులాను లిపులేఖ్ ను అనుసంధానం చేస్తూ టిబెట్ తో కలుపుతోంది. దీంతో రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. ఇందులో కఠినమైన ట్రెక్కింగ్ లు ఉండవు. అందుకే అన్ని వయసుల వారు ఈ యాత్రకు వెళ్లేందుకు సులభమైన మార్గంగా కనిపిస్తోంది. భక్తులకు దగ్గరి దారి కావడంతో ఇకపై మరింత అనువైన విధంగా మారనుంది.

    Also Read:  ఏపీ + తెలంగాణ : ‘ఆర్ఆర్ఆర్’ పక్కా బిజినెస్ లెక్కలివే

    Tags