Minister Roja Daughter: దయచేసి వదిలేయండి మా అమ్మని అలా చూడలేకపోతున్న.. రోజా కూతురు ఎమోషనల్ వీడియో

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మంత్రి రోజా ఆయనపై కొన్ని కామెంట్లు చేశారు. దీంతో టీడీపీ నేత బండారు సత్యనారాయణ రోజాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన సినీ జీవితాన్ని బయటపెడుతానంటూ అనడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : October 11, 2023 3:26 pm

Minister Roja Daughter

Follow us on

Minister Roja Daughter: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రణరంగంలా మారింది. ఒకప్పటి సినీ నటి, ప్రస్తుత మంత్రి రోజాపై టీడీపీ నాయకులు వరుసగా విమర్శలు చేస్తుండడంతో ఆ పార్టీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా రోజా కూతురు ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. తన తల్లి తీవ్రంగా బాధపడుతోందని, ఇలా మా అమ్మను ఎన్నడూ చూడలేదని ఆవేదరన చెందింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమె ఏంకోరుతుందంటే?

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మంత్రి రోజా ఆయనపై కొన్ని కామెంట్లు చేశారు. దీంతో టీడీపీ నేత బండారు సత్యనారాయణ రోజాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన సినీ జీవితాన్ని బయటపెడుతానంటూ అనడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బండారు చేసిన వ్యాఖ్యలు సరికావని మహిళా లోకం సైతం అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే బండారు చేసిన వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించినా లోలోపల తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె కూతురు సోషల్ మీడియాలో స్పందించారు. ఇంట్లో అమ్మ పడే వేదనను చూడలేకపోతున్నామని అన్నారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే మమ్మీ ఇప్పడు చాలా బాధపడుతున్నారని చెప్పింది. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి అని.. కానీ పర్సల్ గా ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొంది. నేను చిన్న పిల్లను అమ్మను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదని, అమ్మ అలా ఉండడం చూసి భోజనం కూడా చేయబుద్ది కావడం లేదని అంటోంది.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై సినీ నటి ఖుష్బూ కూడా స్పందించారు. ఇటీవలే పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ఇలా ఓ మహిళా ప్రజాప్రతినిధిపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. రోజాకు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని ఖుష్బూ అన్నారు. మహిళా నేతలపై కొందరు చేసే వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తామని హెచ్చరించారు.