https://oktelugu.com/

Indian Crickers : రవిశాస్త్రి నుంచి హర్థిక్ పాండ్యా వరకు డైవర్స్ తీసుకున్న క్రికెటర్లు వీరే.. కారణాలు వింటే షాక్ అవ్వాల్సిందే?

సెలబ్రిటీ జంటలు కూడా దీని బారిన పడే అవకాశం లేకపోలేదు. రవిశాస్త్రి నుంచి హార్దిక్ పాండ్యా వరకు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచిన కొందరు భారత క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2024 / 05:36 PM IST
    Follow us on

     

    Indian Crickers : రోజు రోజుకు విలువలు కోల్పోతున్న ప్రపంచంలో, వివాహాలు సంక్లిష్టంగా, స్వల్పకాలికంగా మారిపోయాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవితం ఆనందంగా సాగించేవారు. దీంతో మరింత ఎక్కువ ఆయుష్షుతో జీవించే వారు. కానీ ఇప్పు ఆ పరిస్థితి లేదు. మంచాన పడి చనిపోవడం కోట్లలో ఒకరికి ప్రాప్తిస్తుంది. అందుకే తోడు అవసరం లేదనుకుంటున్నారు. వివాహం చేసుకోవడం అతి తక్కువ సమయంలో కలిసి ఉండడం అంతే వేగంగా విడిపోవడం సాధారణంగా అయిపోయింది. సెలబ్రిటీ జంటలు కూడా దీని బారిన పడే అవకాశం లేకపోలేదు. రవిశాస్త్రి నుంచి హార్దిక్ పాండ్యా వరకు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచిన కొందరు భారత క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

    02
    హార్దిక్ పాండ్యా
    నటాసా స్టాంకోవిచ్ తో వివాహం జరిగిన నాలుగేళ్ల తర్వాత విడాకులు ప్రకటించాడు హార్దిక్ పాండ్యా తన ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ‘మేము మా వంతు ప్రయత్నం చేశాం, మా ఇద్దరికీ ఇది ఉత్తమమైనదిగా నమ్ముతున్నాం. మేమిద్దరం కలిసి గడిపిన రోజులు, పరస్పర గౌరవం, సాంగత్యం, కుటుంబంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఇది కఠినమైన నిర్ణయమని వారు సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. సెర్బియాలో ఉన్న నటాషా ఇటీవల తన కుమారుడు అగస్త్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విభేదాలు, విడిపోయినా ఒకరికొకరు మద్దతుగా నిలిచే ఎమోజీలతో హార్దిక్ ఈ పోస్టుపై వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది.

    03
    శిఖర్ ధావన్
    టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన మాజీ భార్య ఆయేషా ముఖర్జీ నుంచి 2023లో విడాకులు తీసుకున్నాడు. శిఖర్, ఆయేషాకు పదేళ్ల క్రితం వివాహమైంది, వీరికి జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయేషా, జొరావర్ ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరులే. అయేషా మొదటి భర్తతో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధావన్ తన కమిట్‌మెంట్ల కారణంగా భారత్ కు వెళ్లాలని అనుకున్న కారణంగా ఆమె నిరాకరించడంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. శిఖర్ కొన్నేళ్లుగా తన కుమారుడిని కలవలేకపోయినప్పటికీ, అతను పిల్లల కోసం డబ్బు చెల్లించవలసి వచ్చింది. ఆస్తులను విక్రయించవలసి వచ్చింది.


    దినేశ్ కార్తీక్
    టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ నికితా వంజరను వివాహం చేసుకున్నాడు. 2007లో వివాహం చేసుకున్న వీరు 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ సహచరుడైన మురళీ విజయ్ ను నికిత వివాహం చేసుకుంది. 2015లో దినేష్ కార్తీక్ భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ను వివాహం చేసుకున్నాడు. దినేష్, దీపిక దంపతులకు కబీర్, జియాన్ అనే కవల పిల్లలు ఉన్నారు.

    05
    మహ్మద్ అజారొద్దీన్..
    భారత మాజీ క్రికెటర్, లోక్ సభ మాజీ సభ్యుడు మహ్మద్ అజారుద్దీన్ 1996లో నౌరీన్ ను వివాహం చేసుకున్నారు. అయితే మహమ్మద్ అజారుద్దీన్, సంగీతా బిజ్లానీల వివాహం కాలపరీక్షను తట్టుకోలేక 2010లో విడిపోయారు.

    06
    వినోద్ కాంబ్లీ
    1998లో భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్ ను వివాహం చేసుకున్నాడు. అయితే వీరు 2005లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కాంబ్లీ మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్ ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం కోసం క్రైస్తవ మతంలోకి కూడా మారాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

    07
    రవిశాస్త్రి..
    టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి తన చిన్ననాటి స్నేహితురాలు రీతూ సింగ్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి అలేఖా శాస్త్రి అనే కూతురు ఉంది. 22 ఏళ్ల తర్వాత రవిశాస్త్రి, రీతూ సింగ్ 2012లో విడాకులు తీసుకున్నారు.

    08
    మహ్మద్ షమీ
    మహమ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్ విడిపోయారు. హసీన్ జహాన్ తనపై గృహహింస, వ్యభిచారం ఆరోపణలు చేయడంతో షమీ, అతని భార్య 2018లో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె ఉంది.