
దేశంలో గత కొన్ని రోజుల నుంచి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటనూనెల ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు సైతం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇదే సమయంలో బియ్యం ధరలు సైతం ఆకాశాన్ని తాకాయి. గతేడాది సన్నబియ్యం కిలో ధర 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పలకగా ప్రస్తుతం కిలో బియ్యం రూ.48 నుంచి రూ.55 పలుకుతుండటం గమనార్హం.
Also Read: వెలుగులోకి కొత్తరకం మోసం.. సిమ్ బ్లాక్ అంటూ లక్షల్లో మాయం..?
దిగుబడి బాగానే ఉన్నా మార్కెట్‌కు డిమాండ్ కంటే ఎక్కువగా బియ్యం నిల్వలు వస్తున్నా ధరలు తగ్గకపోవడం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వ్యవసాయాధారిత ఉత్పత్తులపై పన్నులను ఎత్తివేసింది. కేంద్రం పన్నులను ఎత్తివేసినా పరిస్థితులలో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. గతంలో వ్యాపారులు పన్నులు చెల్లించిన సమయంలో బియ్యం ధరలు తక్కువగా ఉంటే ఇప్పుడు మాత్రం భిన్నంగా ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు..?
అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హోల్ సేల్ లో క్వింటాలు బియ్యం రూ.3,200 నుంచి రూ.3,600 పలుకుతుంటే మార్కెట్ లో మాత్రం రూ.4,800 నుంచి రూ.5,500 పలుకుతుండటం గమనార్హం. గ్రేటర్ పరిధిలో మిల్లర్ల దగ్గర లక్షన్నర మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా బియ్యం నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బియ్యం వినియోగం అంతకంతకూ పెరుగుతుండగా ధరలు పెరగడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే మాత్రమే ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి.