https://oktelugu.com/

వరి పొట్టుతో లక్షలు సంపాదిస్తున్న ఒడిశా వాసి.. ఎలా అంటే..?

మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కొంతమంది స్వశక్తితో కష్టపడి ఎందుకు ఉపయోగపడవని భావించే వాటితో లక్షలు సంపాదిస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి వరి పొట్టుతో వ్యాపారం చేసి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉద్యోగం మానేసి అగ్రి బిజినెస్ లో కి అడుగు పెట్టిన ఆ వ్యక్తి తెలివిగా వ్యాపారం చేస్తే తక్కువ సమయంలోనే రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించవచ్చని ప్రూవ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రంలోని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2021 / 04:07 PM IST
    Follow us on

    మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కొంతమంది స్వశక్తితో కష్టపడి ఎందుకు ఉపయోగపడవని భావించే వాటితో లక్షలు సంపాదిస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి వరి పొట్టుతో వ్యాపారం చేసి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉద్యోగం మానేసి అగ్రి బిజినెస్ లో కి అడుగు పెట్టిన ఆ వ్యక్తి తెలివిగా వ్యాపారం చేస్తే తక్కువ సమయంలోనే రిస్క్ లేకుండా డబ్బులు సంపాదించవచ్చని ప్రూవ్ చేస్తున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రంలోని కలహందికి చెందిన బిభు సాహు అనే వ్యక్తి ఉపాధ్యాయునిగా పని చేసేవాడు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ వ్యక్తి 2007 సంవత్సరంలో ఉద్యోగం మానేశాడు. ఆ తరువాత రైస్ మిల్లు వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. ప్రతి సంవత్సరం అతనికి రైస్ మిల్లు ద్వారా ఏకంగా 3 టన్నుల వరిపొట్టు వచ్చేది. మొదట్లో ఆ వరిపొట్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించి భిభు సాహు వరిపొట్టును కాల్చివేసే వాడు.

    అయితే వరిపొట్టును కాల్చడం వల్ల వాతావారణ కాలుష్యం అవుతుందని కొందరు చెప్పడంతో ఆ తరువాత వరిపొట్టును బిభు సాహు వేర్ హౌస్ లో దాచేవాడు. ఆ తరువాత బిభు సాహు వరిపొట్టును స్టీల్ ప్లాంట్లలో థర్మల్ ఇన్సులేటర్‏గా వాడవచ్చని ఆలోచించి కొంతమంది నిపుణులను కలిశాడు. అయితే సాహు కలిసిన నిపుణులెవరూ అతని మాటలను పట్టించుకోలేదు. అయితే సాహు అతని స్నేహితులతో కలిసి వరిపొట్టును గుళికలుగా తయారు చేశాడు.

    ఆ తరువాత విదేశాలలోని ప్రముఖ కంపెనీలకు గుళికలకు సంబంధించిన వివరాలతో ఈ మెయిల్ చేశాడు. 2019 సంవత్సరంలో 100 టన్నుల గుళికలను ఎగుమతి చేసి 20 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ తరువాత సంవత్సరం సంవత్సరానికి ఎగుమతులనుపెంచుకుంటూ బిభు సాహూ ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నాడు.