ఆ మూడు గంటల్లో ఏం జరిగింది..? : పెద్దిరెడ్డిలో ఎందుకీ మార్పు

తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలు అవుతాయో లేదో చూసుకోవాలి..! ఇది తనను హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల గురించి తెలిసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ‘ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా వ్యతిరేకంగా మాట్లాడను. అక్రమాలకు పాల్పడను.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనను..!’ ఇదీ మూడు గంటల తర్వాత మీడియాను పిలిచి మరీ మాట్లాడిన మాటలు. Also Read: బడ్జెట్‌లో న్యాయమే జరిగిందట..: సంజయ్‌ మాట ఈ మధ్యలో ఏం జరిగి […]

Written By: Srinivas, Updated On : February 7, 2021 4:13 pm
Follow us on


తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలు అవుతాయో లేదో చూసుకోవాలి..! ఇది తనను హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల గురించి తెలిసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ‘ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా వ్యతిరేకంగా మాట్లాడను. అక్రమాలకు పాల్పడను.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనను..!’ ఇదీ మూడు గంటల తర్వాత మీడియాను పిలిచి మరీ మాట్లాడిన మాటలు.

Also Read: బడ్జెట్‌లో న్యాయమే జరిగిందట..: సంజయ్‌ మాట

ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది..? కానీ.. పెద్దిరెడ్డి లాంటి పెద్దమనిషిని పూర్తిగా బెండ్ అయ్యేలా పరిణామాలు జరిగాయని మాత్రం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. పెద్దిరెడ్డి ఉద్యోగుల్ని బెదిరిస్తూ ఉండటం.. ఎస్‌ఈసీపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ నెల 21వ తేదీ వరకూ ఆయనను హౌస్‌ అరెస్ట్‌లో ఉంచాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి స్పష్టమైన సూచనలు వెళ్లాయి. అయితే.. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి ఆవేశపడిపోయారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి.. మళ్లీ నిమ్మగడ్డను చెడామడా తిట్టేశారు. నిమ్మగడ్డ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరంలేదని.. మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన దుర్మార్గమని విమర్శించారు. తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలవుతాయో లేదో చూసుకోవాలని.. నిమ్మగడ్డ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన పనిలేదని తేల్చేశారు.

మూడు గంటల తర్వాత మీడియాను ఆయన ఇంటి వద్దకు రావాలని ఆహ్వానించారు. వెళ్లిన వారికి పెద్దిరెడ్డి షాకిచ్చారు. తడబడుతూ.. సిగ్గుపడుతూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేయనని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వతా మళ్లీ నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. రేపు, ఎల్లుండి కూడా ఉంటానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వద్ద నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసి కారెక్కి ఇంటికి వెళ్లిపోయారు.

Also Read: రమణ యాక్టివ్‌ రోల్‌..: ఎమ్మెల్సీగా బరిలోకి..

అయితే.. నిమ్మగడ్డ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనను వైసీపీ వర్గాలు చేశాయని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో సానుకూల ఫలితం వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెప్పడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆదేశాలు అమలు చేయకుండా పెద్దిరెడ్డి ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే.. బలవంతంగా హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. దాంతో ఆయన కట్టుబడి ఉంటానని ప్రకటించాల్సి వచ్చిందంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్