Revanth Reddy : మళ్లీ కార్యకర్తను కొట్టిన రేవంత్‌ రెడ్డి.. వైరల్‌ వీడియో.. ఇలాగైతే ఎలా గెలుస్తావయ్యా?

తాజాగా, రామగుండంలో ప్రచార సభలకు హాజరైన రేవంత్‌ తనకు పాదాభివందనం చేసుందుకు వచ్చిన అభిమాని వీపుపై పిడిగుద్దులు గుద్దారు. ఇప్పుడు ఈవీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Written By: NARESH, Updated On : November 12, 2023 1:18 pm
Follow us on

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం జోరందుకుంది. ఒకవైపు నెల రోజులుగా అధికార బీఆర్‌ఎస ప్రచారంలో దూసుకుపోతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రచారంలో జోరు పెంచుతున్నాయి. రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు, కర్ణాటక సీఎం, డిప్యూటీసీఎంలను ప్రచారంలోకి దించింది. ఇక బీజేపీ ఏకంగా ప్రధానినే రంగంలోకి దించుతోంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో టీపీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు దీటుగా నియోజకవర్గాల వారీగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భంగాల్లో ఆయన కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది.

అభిమానులపై అగ్రెసివ్‌..
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులపైనే అగ్రెసివ్‌ అవుతున్నారు. ముఖ్య నేతల పర్యటన సందర్భంగా వారిని కలిసేందుకు వచ్చేవారిని వేదికపై నుంచి తోసేస్తున్నారు. వారిని కలవకుండా అడ్డుకుంటున్నారు. అదే సమయంలో తన ప్రచారసభల్లో సైతం తనను కలిసేందుకు వచ్చే కార్యకర్తలు, అభిమానులపై చేయి, కాలు చేసుకుంటున్నారు. కొడంగల్‌లో తన నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తనను కలిసేందకు వచ్చిన కార్యకర్తను కాలితో తన్నారు. దీనికి సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తాజాగా, రామగుండంలో ప్రచార సభలకు హాజరైన రేవంత్‌ తనకు పాదాభివందనం చేసుందుకు వచ్చిన అభిమాని వీపుపై పిడిగుద్దులు గుద్దారు. ఇప్పుడు ఈవీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రేవంత్‌రెడ్డి తీరుపై విమర్శలు..
అందరినీ కలుపుకుపోవాల్సిన నాయకుడు అభిమానులు, కార్యకర్తలపై చేయి చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఒకవైపు కాంగ్రెస్‌కు తెలంగాణలో ఊపు పెరుగుతోంది. పార్టీని గెలిపించాలనే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల మేనిఫెస్టో తర్వాత మరింత ఊపు వస్తుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కానీ, ఇంతలో రేవంత్‌ తీరు, దానికి సబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వేరల్‌ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందరినీ కలుపుకుపోకుండా దాడిచేయడాన్ని తప్పు పడుతున్నారు. సమయా భావంతో అభిమానులను కలవడం వీలు కావడం లేదేమో కానీ, దానిని సున్నితంగా చెప్పాలని సూచిస్తున్నారు.

భద్రత భయంతోనేనా..
ఇదిలా ఉంటే భద్రత భయంతోనే రేవంత్‌ అలా వ్యవహరిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇటీవల మెదక్‌ ఎంపీపై కత్తితో దాడి జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నేతలకు భద్రత పెంచింది. కానీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ కూడా తనకు భద్రత పెంచాలని కోరారు. అయినా పెంచలేదు. దీంతో ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో అన్న భావనతోనే అభిమానులను, క్యాడర్‌ను తోచేస్తున్నారని అంటున్నారు.