Mossad Operation : మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బిన్ లాడెన్ ను అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సంస్థ సిఐఏ అత్యంత చాకచక్యంగా పాకిస్తాన్ లో చంపేసింది. అప్పట్లో ఈ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా (చైనా మినహా) అమెరికన్ సిఐఏ గురించి గొప్పగా రాసింది. ఈ స్థాయి రహస్య ఆపరేషన్లు మరే సంస్థ చేపట్టలేదని కుండబద్దలు కొట్టింది. కానీ మీడియా ఫోకస్ లోకి రాని ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ మొస్సాద్ అమెరికన్ సిఐఏ కంటే గొప్ప గొప్ప ఆపరేషన్లు చేపట్టింది. రెండో కంటికి తెలియకుండా లక్ష్యాన్ని చేదించింది. చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ.. తనను తాను ఇజ్రాయిల్ కాపాడుకుంటున్నదంటే దానికి ప్రధాన కారణం మొస్సాద్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఐరన్ డోమ్ లాంటి దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ… ఇజ్రాయిల్ దాన్ని మాత్రమే కాకుండా మొస్సాద్ అనే సమాంతర వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. అందువల్లే ఇజ్రాయిల్ నిశ్చింతగా ఉండగలుగుతోంది. ప్రస్తుతం ఇరాన్, లెబనాన్ వంటి దేశాల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ ఒక సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. మొస్సాద్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ జేమ్స్ బాండ్ సినిమాను తలపిస్తోంది. ఈ ఆపరేషన్ “ఆపరేషన్ స్యాడెనెస్”ను గుర్తుకు తెస్తోంది.
వెంటనే పసిగడుతుంది
ఇజ్రాయిల్ నిఘా సంస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఆ సంస్థకు వెంటనే తెలిసిపోతుంది. చివరికి శత్రువు ఏ మూలలో దాక్కున్న వెంటనే వెతికి పట్టి చంపేస్తుంది.. అయితే ఈ సంస్థ హమాస్ అగ్రనేత హనియాను ఇటీవల అంతమొందించింది. దీంతో మొస్సాద్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి హనియా హత్య తర్వాత మొస్సాద్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే అతడు చనిపోయిన విధానం మాత్రం మొస్సాద్ చేపట్టిన రహస్య ఆపరేషన్లను గుర్తుకు తెస్తోంది. హనియా బస చేసిన హోటల్లో ముందే మందు పాతర పెట్టి, అతడిని అంతమొందించింది. అతను చనిపోయిన తీరు “ఆపరేషన్ సాడ్ నెస్” ను జ్ఞప్తికి తీసుకొస్తోంది.
చాలా ఆపరేషన్లు
మొస్సాద్ కు ఇలాంటి ఆపరేషన్లో కొట్టినపిండి. గతంలో తమ శత్రువులను వారి ఇంట్లోనే హతమార్చింది.. వారికి తెలియకుండానే విష పదార్థాలను వారు తినే వంటకాల్లో కలిపి చంపేసింది. ఇలా చనిపోయిన వారిలో చాలామంది ఉన్నారు. ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడిన పాపులర్ ప్రింట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ఇజ్రాయిల్ పై అనేక దాడులు చేసింది. ఈ సంస్థకు చీఫ్ గా వాడి సద్దాద్ ఉండేవాడు. 1976 లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. దానిని టెల్ అవీవ్ ప్రాంతం నుంచి పారిస్ తీసుకెళ్లారు. అనంతరం ఉగాండాకు తరలించారు. ఆపరేషన్ థండర్ బోల్ట్ ద్వారా ఇజ్రాయిల్ దీనిని తిప్పికొట్టింది. ఈ మిషన్ కు అప్పటి లెఫ్టినెంట్ కల్నల్ యోనాతన్ నెతన్యాహు సారధ్యం వహించారు. అయితే ఆ మిషన్ లో యోనాతన్ కన్నుమూశారు. అతడు ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కు స్వయాన సోదరుడు.
ప్రతీకారం తీర్చుకుంది
యోనాతన్ చనిపోయిన నేపథ్యంలో.. గట్టి కౌంటర్ ఇవ్వాలని భావించిన మొస్సాద్ ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసిన హద్దాద్ ను ఎటువంటి హడావిడి లేకుండా చంపేసింది. ఇందుకు అతడి కార్యాలయంలో పనిచేసే వ్యక్తికి తాయిలం ఎరవేసింది. అతడికి ఏజెంట్ స్యాడ్ నెస్ పేరు పెట్టింది. 1978 జనవరి 10న ఏజెంట్ స్యాడ్ నెస్ తనకు ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేశాడు. హద్దాద్ రోజూ ఉపయోగించే టూత్ పేస్ట్ స్థానంలో విషపు టూత్ పేస్ట్ ఉంచాడు. దానిని ఇజ్రాయిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫర్ బయాలజీ కల్చర్ సెంటర్ తయారుచేసింది. ఆ టూత్ పేస్ట్ అత్యంత విషపూరితమైన రసాయనాలతో తయారు చేశారు. ఆ టూత్ పేస్ట్ ను హద్దాద్ వాడినప్పుడు.. అది నేరుగా శ్లేష్మ పొరల్లోకి చొచ్చుకెళ్ళింది. అక్రమంగా ప్రాణాంతకంగా మారింది.
కొద్ది రోజుల్లోనే తీవ్రమైన అనారోగ్యం
కొద్ది రోజుల్లోనే హద్దాద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఆకలి తగ్గిపోయింది. కడుపులో తీవ్రమైన నొప్పి. బరువు పూర్తిగా తగ్గిపోయాడు. ప్రపంచ స్థాయి వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే అతడి జుట్టు ఊడిపోయింది. ఈ దశలో విష ప్రయోగం జరిగి ఉంటుందని వైద్యులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో హద్దాద్ ను పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నేత యాసర్ అరాఫత్ పశ్చిమ జర్మనీ రహస్య సర్వీస్ సంస్థను సహాయం కోరాడు. దీంతో వారు హద్దాద్ ను స్పెషల్ ఫ్లైట్ లో తూర్పు బెర్లిన్ తీసుకెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినప్పటికీ అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. 1978 మార్చి 29న హద్దాద్ కన్నుమూశాడు. అతడి శరీరంలోకి విషం ఎలా వెళ్ళింది అనేది మాత్రం కొద్ది సంవత్సరాల వరకు బయట ప్రపంచానికి తెలియలేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Much is said about the cia but more than that israels mossad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com