Paris Olympics 2024 : ప్యారిస్ ఒలింపిక్స్ భారత్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. క్రీడలు ప్రారంభమై పది రోజులు గడిచింది. ఇపపటి వరకు భారత్ ఖాతాలో మూడు కాంస్యాలు మాత్రమే చేరాయి. కొన్ని క్రీడాంశాల్లో ఆటగాళ్లు చివరి వరకు పోరాడి ఓడారు. దీంతో వస్తుందనుకున‍్న పతకాలు చేజారాయి. కొన్నింటిలో ముందే నిరాశపర్చారు. తాజాగా భారత హాకీ జట్టు పతకంపై ఆశలు రేపింది.
పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వార్టర్స్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. బ్రిటన్తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో మొదట ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ మొదటి క్వార్టర్‌లో భారత్, బ్రిటన్ జట్లు రెండూ గోల్స్ ఏమీ చేయలేదు. తరువాత ఆట 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. 27వ నిమిషంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ లీ గోల్ చేయడంతో రెండు 1-1తో స్కోర్ సమం అయింది. ఆట ముగిసే సమయానికి రెండు జట్లూ మరో గోల్ చేయకపోవడంతో మ్యాచ్ టై అయింది.
షూటౌట్‌లో విజయం..
ఆ తర్వాత షూటౌట్ జరిగింది. అందులో బ్రిటన్ జట్టు కొట్టే గోల్స్ను అడ్డుకోవడంలో కాస్త తడబడిన భారత్ ఆటగాళ్లు తర్వాత బ్రిటన్‌కు దీటుగా గోల్స్ కొట్టారు. షూటౌట్‌లో 4-2 తేడాతో భారత్ విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్, రాజ్‌కుమార్ పాల్ భారత్ తరఫున పెనాల్టీ షూటౌట్‌కి వెళ్లారు. ప్రత్యర్థి బ్రిటన్ జట్టు నుంచి ఒలివర్ పేన్, జేమ్స్ ఆల్బరీ, జాచరీ వాలెస్, కానర్ విలియమ్స్, ఫిల్ రోపర్ షూటౌట్ చేశారు. ఈ షూటౌట్‌లో బ్రిటన్ ఆటగాళ్లు జేమ్స్ అల్బరీ, జాచరీ వాలెస్ గోల్స్ చేశారు. భారత గోల్ కీపర్ శ్రీజేష్ మిగిలిన మూడు బంతులను అడ్డుకున్నారు.భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్ పాల్ గోల్స్ చేశారు. షూటౌట్‌లో బ్రిటన్‌ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది.
పది మందితోనే ఆడిన భారత జట్టు..
ఈ మ్యాచ్‌లో భారత్ 10 మంది ఆటగాళ్లతో ఆడింది. ఎందుకంటే రెండో క్వార్టర్‌్సలో అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ ఇచ్చారు. మ్యాచ్ రెండో క్వార్టర్ ప్రారంభమైన రెండో నిమిషంలో అమిత్ రోహిదాస్ మిడ్ ఫీల్డ్‌లో డ్రిబ్లింగ్ చేశాడు. ఆ సమయంలో తన హాకీ స్టిక్ ప్రత్యర్థి జట్టు ఆటగాడు విల్ కాల్నన్ ముఖానికి తగిలింది. దీంతో అమిత్‌కి రెడ్ కార్డు చూపించడంతో గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత జట్టు 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించింది. ఈ కారణంగా అతను మొత్తం మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయినా పట్టు వదలని భారత జట్టు చివరి వరకు బ్రిటన్‌కు గట్టిపోటీనిచ్చింది. ఈ విధంగా భారత జట్టు పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. సెమీఫైనల్‌లో విజయం సాధిస్తే భారత్‌కు కనీసం రజత పతకం ఖాయం అవుతుంది. ఆగస్టు 6వ తేదీన భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More