Ind vs China : దుష్ట చైనా.. దాని బుద్ధి ఎప్పుడూ కుక్క తోక వంకర తీరే.. తాజాగా భారత్ పై మళ్ళీ పడింది..

ఈ ప్రాజెక్టును నిర్మించి భవిష్యత్తులో వాటర్ బాంబుగా చైనా ఉపయోగించుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేమని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

Written By: NARESH, Updated On : August 4, 2024 8:50 pm

China is building another bridge over the Brahmaputra river

Follow us on

Ind vs China :  కుక్క తోకకు ఎంతటి బరువైన రాయి కట్టినా సక్కగా మారదు. ఎందుకంటే దాని జన్మలక్షణమే అది కాబట్టి. చైనా తీరు కూడా అంతే. టిబెట్ ఆక్రమణ విషయంలో ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా, ఐక్యరాజ్యసమితి నెత్తినోరు మొత్తుకుంటున్నా చైనా తన బుద్ధి మార్చుకోదు. పైగా చుట్టుపక్కల ఉన్న దేశాల సరిహద్దుల్లో తరచూ గెలుకుతూనే ఉంటుంది. భూటాన్ నుంచి మొదలుపెడితే భారత్ వరకు .. ఇలా అన్ని దేశాల్లోనూ చైనా వేలు పెట్టింది. అక్కడి దాకా ఎందుకు.. అగ్రరాజ్యమైన అమెరికాపై సీక్రెట్ బెలూన్లు వదిలిన నీచమైన చరిత్ర చైనాది. మన దేశంతో పలుమార్లు సరిహద్దుల్లో వివాదాలు సృష్టించిన చైనా.. ఇప్పుడు తాజాగా బ్రహ్మపుత్ర నదిపై డ్రాగన్ దృష్టి సారించింది. ఆ నదిపై భారీ స్థాయిలో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు పావులు కదుపుతోంది. ఇదే గనక వాస్తవ రూపం దాల్చితే భారతదేశానికి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయి..

చైనా మన దేశంపై తరచుగా విషం చిమ్ముతూనే ఉంటుంది. మనకు శత్రుదేశమైన పాకిస్తాన్ తో అంట కాగుతూ.. ప్రపంచ వేదికలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తూ ఉంటుంది. మన దేశ అభివృద్ధికి ప్రతిబంధకంగా నిలుస్తూ ఉంటుంది. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ రాక్షసానందం పొందుతూ ఉంటుంది. అయితే చైనా చేస్తున్న దారుణాలను మనదేశంలోని లెఫ్ట్ మీడియా ఏమాత్రం ప్రసారం చేయదు. ప్రచురించదు. పైగా మన దేశాన్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతూనే ఉంది. దీనికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో చూడాలి మరి..

తాజాగా చైనా బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు సన్నా హాలు చేస్తోంది. గతంలోని దీనికి సంబంధించిన వార్తలు బయటికి వచ్చినప్పటికీ.. కొన్ని సంవత్సరాలపాటు ఆ వ్యవహారాన్ని చైనా స్తబ్దుగా ఉంచింది.. ప్రస్తుతం ఈ డ్యాం నిర్మాణం విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నట్టు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్ స్టిట్యూట్ విడుదల చేసిన నివేదికలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.

బ్రహ్మపుత్ర నది భారత్ లో ప్రవేశించేందుకు ముందు అర్థ చంద్రకారంలో వంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వంపు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించాలని చైనా అడుగులు వేస్తోంది. బ్రహ్మపుత్ర నది ప్రవాహం మీదే ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి బ్రహ్మపుత్ర నది ప్రవాహమే ప్రధాన ఆధారం. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించేందుకు ముందు బ్రహ్మపుత్ర నది 3000 మీటర్ల దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే ప్రాజెక్టు నిర్మించాలని చైనా భావిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చైనా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందని సమాచారం. అయితే చైనా ఇక్కడ నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని తెలుస్తోంది.

చైనా ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల భారత్ కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నదిలోని నీటిని చైనా పూర్తిగా మళ్ళిస్తే ఈశాన్య రాష్ట్రాలకు తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇక వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి విపరీతమైన నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నీటిని చైనా ఒకేసారి విడుదల చేస్తే దిగువన ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయి. ఇక చైనా నిర్మించే ప్రాజెక్టు భారత సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీనివల్ల రక్షణ పరంగా కూడా భారతదేశానికి తీవ్రమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఆ ప్రాజెక్టులో నిల్వచేసిన అన్నిటిని ఒకేసారి విడుదల చేస్తే దిగువన ఉన్న ప్రాంతాలు నీట మునిగిపోతాయి. ఈ ప్రాజెక్టును నిర్మించి భవిష్యత్తులో వాటర్ బాంబుగా చైనా ఉపయోగించుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేమని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడమే భారత్ ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు.