
AP New Governor : కేంద్ర ప్రభుత్వం భారీగా గవర్నర్ల నియామకాన్ని చేపట్టింది. కొంతమందికి స్థాన చలనం కల్పించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ స్థానంలో రిటైర్డ్ జడ్జి బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆయన ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేశారు.
-చత్తీస్ గఢ్ కు విశ్వ భూషణ్…
ఇప్పుడు ఏపీ గవర్నర్ గా ఉన్న విశ్వ భూషణ్ ను చతిస్ గఢ్ కు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇతరులు జారీ చేశారు. ఆ స్థానంలో ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించారు. దీంతో పాటుగా మరి కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. మరి కొందరి స్థానాల్లో మార్పులు – చేర్పులు చేశారు.
-మూడేళ్లు ఏపీ గవర్నర్ గా..
ఏపీ గవర్నర్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న విశ్వ భూషణ్ హరి చందన్ 2019, జలై 17న బాధ్యతలు స్వీకరించారు. దాదాపుగా మూడేళ్ల పదవీ కాలం ముగియటంతో ఆయన్ను మరో రాష్ట్రానికి బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత దాదాపు అయిదేళ్ల కాలం నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించారు. విభజించిన ఏపీకి తొలి గవర్నర్ గా బిశ్వభూషణ్ వ్యవహరించారు. ఇప్పుడు ఆయన్ను చత్తీస్ గడ్ కు బదిలీ చేశారు. కొత్తగా నియమితులైన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ వారంలోనే బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
-కొత్త గవర్నర్ నేపథ్యం ఇదీ..
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియామకమైన ఎస్.అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, ఈ ఏడాది జనవరి 4న రిటైర్ అయ్యారు. 1958లో జన్మించిన ఈయన.. 1983లో అడ్వకేట్ గా పేరు నమోదు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. చరిత్రాత్మకమైన అయోధ్య రామ జన్మభూమి తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో నజీర్ కూడా ఉన్నారు.
-పలు రాష్ట్రాలకు..
ఇదివరకే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆయన స్థానంలో కొత్తగా రమేశ్ బైస్ను నియమించారు. సీనియర్ బీజేపీ నేత సీపీ రాధాక్రిష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కైవల్యా త్రివిక్రమ్ పర్ణాయక్ గా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అసోమ్ గవర్నర్ గా గులాబ్ చంద్ కఠారియా నియమితులయ్యారు. లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బీడీ.మిశ్రా కొనసాగనున్నారు.
– నూతన గవర్నర్ల జాబితా..
ఆంధ్రప్రదేశ్ – జస్టిస్ అబ్దుల్ నజీర్
ఛత్తీస్‌గఢ్ – బిశ్వభూషణ్ హరిచందన్
మహారాష్ట్ర – రమేశ్ బైస్
హిమాచల్ ప్రదేశ్ – శివ్ ప్రతాప్ శుక్లా
అరుణాచల్‌ప్రదేశ్ – లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
సిక్కిం – లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
ఝార్ఖండ్ – సి.పి. రాధాకృష్ణన్
అసోం – గులాబ్ చంద్ కటారియా
మణిపూర్ – అనుసూయ
నాగాలాండ్ – గణేశన్
మేఘాలయ – ఫాగు చౌహాన్
బిహార్ – రాజేంద్ర విశ్వనాథ్
లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ – బీడీ మిశ్రా