
Model win Elections : ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఓట్లు వేయించుకుని, ప్రజలను పాలించాలంటే కచ్చితంగా ఎన్నికల్లో గెలవాలి. ఇక భారత్ లాంటి దేశాల్లో అయితే ఎన్నికలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అనేక తాయిలాలు, వరాలు ఇస్తే తప్ప ఓటర్ల మదిని గెలుచు కోవడం సాధ్యం కాదు. వారిని ఐదేళ్లపాటు పాలించడం వీలుపడదు. సరే ఈ గోల మనకూ ఎప్పుడూ ఉండేదే కానీ…ఒక్కసారి మనం ఇండియాను దాటి ఈక్వెడార్ వెళదాం. అక్కడ ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికలు జరిగాయి. అందులో ఓ మోడల్ ఘన విజయం సాధించింది..ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? అది ముమ్మాటికీ వింతే. ఇందుకు ఆమె ఎంచుకున్న పద్ధతే అందరిని నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తోంది.
మరియా ఫెర్నాండా వర్గాస్.. ఈక్వెడార్ లో పేరొందిన మోడల్. అయితే ఇటీవల స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ ఎన్నికల్లో మరియా ఫెర్నాండా వర్గాస్ అలియాస్ మాఫర్ నిలబడింది. అయితే మొదట్లో ఆమెను ఎవరూ అంతగా లెక్కపెట్టలేదు.. దీంతో ఆమె ఓడిపోతుందని కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ ఆమె విజయాన్ని ముందుగానే ఊహించిన స్థానిక నాయకుడు రాఫెల్ కొరియా ఏకంగా మరియా ఫెర్నాండా వర్గాస్ కు మద్దతు పలికాడు.. ఆమెను విమర్శించే వారిపై విరుచుకుపడ్డాడు.. మరియా ఫెర్నాండా వర్గాస్ ను విమర్శించేవారు ఆమె పనిని చూడాలని హితవు పలికాడు.. కొరియా ఇచ్చిన ప్రోత్సాహంతో మరియా ఫెర్నాండా వర్గాస్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేసింది. తన మోడలింగ్ వృత్తికి స్వస్తి పలికింది. అన్ని వర్గాలను కలిసి తన లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా చెప్పింది.

అంతేకాదు మోడల్ గా ఉన్నప్పుడు తన బోల్డ్ ఫోటోలను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును తన ప్రచారానికి వాడుకుంది. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన బోల్డ్ ఫోటోలను పోస్ట్ చేయడంతో… యువత బాగా ఆకర్షితులయ్యారు.. దీంతో మరియా ఫెర్నాండా వర్గాస్ ఆమె ఎన్నికల్లో గెలిస్తే ఏదో చేస్తుందన్న అంచనా ప్రజల్లో కలిగింది.. పైగా ఆమె వినూత్న విధానంలో ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చింది.. ఫలితంగా స్థానిక ఎన్నికల్లో దాదాపు 50% ఓట్లతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో “ఇది అ విశ్రాంత పోరాటానికి దక్కిన విజయం. మెరుగైన సైమన్ బోలివర్ కోసం ఆ విశ్రాంతంగా కృషి చేయాల్సిన సమయం ఎన్నో సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాల్సిన సమయం సైమన్ బోలివర్ మేయర్ గా గెలిచినందుకు ఆనందంగా ఉంది. బ్యాలెట్ బాక్స్ ల వద్ద మీరందరూ నాకు పై సుముఖత వ్యక్తం చేశారు.. అందువల్లే నేను మొదటి మహిళా మేయర్ అయ్యాను. సైమన్ బోలివర్ చరిత్రలో అత్యధికంగా ఓట్లు సాధించిన మహిళను కూడా అయ్యాను. ఈ చారిత్రాత్మక ప్రక్రియలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు” అంటూ ఉద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది.
మరియా ఫెర్నాండా వర్గాస్ కేవలం మోడల్ మాత్రమే కాదు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ మిలాగ్రో నుంచి జర్నలిజం లో పట్టా పొందింది. తనకు ఒక బ్యూటీ సెలూన్ కూడా ఉంది.. మేయర్ గా తొలి ప్రాధాన్యం రైతులు, ఎన్నికలు, యువత సమస్యల పరిష్కారమే అని చెబుతున్న మరియా ఫెర్నాండా వర్గాస్… మేయర్ ఎన్నికల్లో తన బోల్డ్ ఫోటోలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ప్రచారం చేసి గెలిచారు. ఈక్వెడార్ కాదు ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేశారు.. ఎందుకంటే ఎన్నికల్లో మేయర్ గా గెలవడం ఒక అసాధారణమైతే… అందుకు ఆమె ఎంచుకున్న పద్ధతి మరింత అసాధారణం.. ఆమె గెలుపు వెనుక ఉన్న కథా కమామీసును చూసిన వారంతా ఇప్పుడు నోరెళ్ల పెడుతున్నారు.. బాబోయ్ ఎన్నికల్లో ఇలా కూడా గెలవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. మరియా ఫెర్నాండా వర్గాసా మజాకా! అసలే మోడల్ మరి… తన అందచందాలతో గుంప గుత్తుగా ఓట్లు వేయించుకొని మరీ గెలిచింది.